వేతనాల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-12-29T04:57:41+05:30 IST

కేంద్రప్రభుత్వ పరి ధిలోని స్వచ్ఛభారత్‌ కింద జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఆకలికేకలు పెడుతున్నారు.

వేతనాల కోసం ఎదురుచూపులు

డీపీవో నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న శేషయ్య

 స్వచ్చభారత్‌ కార్మికుల పరిస్థితి దారుణం

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 28: కేంద్రప్రభుత్వ పరి ధిలోని స్వచ్ఛభారత్‌ కింద జిల్లాలో పనిచేస్తున్న కార్మికుల కు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఆకలికేకలు పెడుతున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద జిల్లావ్యాప్తంగా 1,800 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే వారికి ప్రతినెల ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లా లోని 56 మండలాల్లో కార్మికులు పనిచేస్తుండగా, తొమ్మిది నుంచి 24 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామాల్లో వీధులను శుభ్రం చేసిన వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో పనిచేసే స్వచ్ఛభారత్‌ కా ర్మికుల వేతనాలు ఆయా మండలాల నుంచి ప్రతినెల ఆన్‌లైన్‌ ద్వారా పంపుతున్నారు. అయితే బిల్లులు తయారు చేస్తున్నారే తప్ప వేత నాలు మాత్రం రావడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం

కాగా స్వచ్ఛభారత్‌ కింద పనిచేసే కార్మికులకు చెల్లించాల్సిన వేత నాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం నెలకొంది. ఆ కారణంగా వారికి వేతనాలు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ నెలకానెల జిల్లాల నుంచి రాష్ట్రప్రభుత్వానికి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు పంపుతున్నారు. అయితే వేతనాలు సకాలంలో వస్తున్నాయా రావడం లేదా అనేది పరిశీ లించాల్సి ఉంది. అయితే ఏ స్థాయిలోనూ ఆ పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో పనిచేస్తున్న 1,800 మంది కార్మికులు వేత నాలు రాక రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. 

బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి

పారిశుధ్య కార్మికులకు బకాయిలు చె ల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛభారత్‌ పారిశుధ్య కార్మికుల యూని యన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు పీవీ శేషయ్య కోరారు. మంగళవారం డీపీఓ నారాయణరెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఎనిమిది నుంచి 24 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని త్వరగా వారికి బకాయిలు చెల్లించే విధంగా చూడాలని కోరారు. 

వేతన బకాయిల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి

- జీవీ నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

స్వచ్ఛభారత్‌ కార్మికులకు వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. క్షేత్రస్థాయిలో వేతన చెల్లింపులకు ఆటంకంగా ఉన్న సాంకేతిక ఇతర సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో కార్మికులకు వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2021-12-29T04:57:41+05:30 IST