చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి అంచనాలు
ABN , First Publish Date - 2021-11-06T04:49:53+05:30 IST
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి పలు ప్రణాళికలు, అంచనాలు రూపొందించి భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీ కృష్ణతో పాటు దేవదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్తర ద్వారాన్ని ఆధునికీకరించే విషయంపై చర్చించారు. దీనితో పాటు పడమట గోపురం, దక్షిణ గోపురం నిర్మాణాలపై కూడా చర్చ జరిగింది.

మార్కాపురం(వన్‌టౌన్), నవంబరు 5: మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి పలు ప్రణాళికలు, అంచనాలు రూపొందించి భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీ కృష్ణతో పాటు దేవదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్తర ద్వారాన్ని ఆధునికీకరించే విషయంపై చర్చించారు. దీనితో పాటు పడమట గోపురం, దక్షిణ గోపురం నిర్మాణాలపై కూడా చర్చ జరిగింది. ఈశాన్య దిక్కున చేపట్టాల్సిన మార్పును, అధికారుల సూచనలు నూతన నిర్మాణాలకు, ఆధునీకరణకు నిధులు ఎంత కావాలి.., ఎలా సమకూర్చాలి అనే అంశంపై స్థానిక నాయకులతో ఆలయ అభివృద్ధి చేసే దాతలతో చర్చించారు. అంచనాలు రూపొందించి ఒక్కో నిర్మాణానికి ఎంత కావాలో దేవదాయ శాఖ అధికారి జనార్దనరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఏఈఈ మురళీమోహన్, సహాయస్థపతి సురేంద్ర, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, కమలా విద్యా సంస్థల అధినేత పెనుగొండ కేశవరావు, కౌన్సిలర్, శ్రావణి చారిటబుల్ చైర్మన్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి రామడుగు రమేష్, ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.