క్లబ్‌లో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు

ABN , First Publish Date - 2021-10-22T05:09:20+05:30 IST

కనిగిరి కాస్మోపాలిటన్‌ క్లబ్‌లో గురువారం ఎక్సైజ్‌ సీఐ మహ్మద్‌అబ్దుల్‌జలీల్‌ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

క్లబ్‌లో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు
మద్యం బాటిళ్ళు పరిశీలిస్తున్న సీఐ జలీల్‌

34 అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత

కనిగిరి, అక్టోబరు 21 : కనిగిరి కాస్మోపాలిటన్‌ క్లబ్‌లో గురువారం ఎక్సైజ్‌ సీఐ మహ్మద్‌అబ్దుల్‌జలీల్‌ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా క్లబ్‌ ర్యాకుల్లోని అరల్లో 34 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 24 ఫుల్‌ బాటిళ్లు వివిధ బ్రాండ్లకు సంబంధించినవి ఉన్నాయి. ఇక మిగిలినవి క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై క్లబ్‌ కమిటీ సెక్రటరీని సీఐ ప్రశ్నించగా ర్యాక్‌లు ఎవరు వినియోగించుకుంటున్నారో తెలియదన్నారు. దీంతో లాకర్లకు నెంబర్లను నమోదు చేసి ఏయే ర్యాక్‌ నుంచి ఏ మద్యం బాటిళ్లను సేకరించింది వివరాలను నమోదు చేశారు. తమకు అందిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సీఐ జలీల్‌ తెలిపారు. ప్రాథమిక విచారణలో శ్రీరాం సురేష్‌, ప్రసాద్‌ అనే వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. అదేవిధంగా కాస్మోపాలిటన్‌ క్లబ్‌ బైలా, స్టాఫ్‌ వివరాలు, క్లబ్‌కు చెందిన పూర్తి వివరాలు, కమిటీ సభ్యుల వివరాలు, ర్యాక్‌లకు సంబంధించిన వారి వివరాలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు. క్లబ్‌లో అనుమతులు లే కుండా మద్యం సే వించడం నేరమన్నారు. అదేవిధం గా నగరంలో అక్రమంగా రెస్టారెంట్లలో, డా బాల్లో మద్యం సిట్టింగ్‌లు నిర్వహించడం కూడా నేరమన్నారు. గుట్కా, అక్రమ మద్యం వాటి వివరాలు తెలియపరిచిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని 9440902504 సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-10-22T05:09:20+05:30 IST