ఎక్స్‌కవేటర్‌ ఢీకొని సైక్లిస్టు మృతి

ABN , First Publish Date - 2021-12-09T04:38:08+05:30 IST

విద్యుత్‌ స్తంభాలు ఎత్తేందుకు ఉపయోగించే భారీ ఎక్స్‌కవేటర్‌ తగిలి సైకిలిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎక్స్‌కవేటర్‌ ఢీకొని సైక్లిస్టు మృతి
ప్రమాద స్థలంలో ఎర్రబ్బి మృతదేహం

కందుకూరు, డిసెంబరు 8 : విద్యుత్‌ స్తంభాలు ఎత్తేందుకు ఉపయోగించే భారీ ఎక్స్‌కవేటర్‌ తగిలి సైకిలిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం కందుకూరులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పట్టణంలోని చాకలిపాలేనికి చెందిన కొచ్చర్ల ఎర్రబ్బి(65) అక్కడికక్కడే మృతి  చెం దాడు. రాజ్‌ థియేటర్‌ వైపు నుంచి ఎన్‌టీఆర్‌ విగ్రహం వైపు సైకిల్‌పై వస్తున్నాడు. ఎర్రబ్బిని వెనుక నుంచి వచ్చిన భారీ ఎక్స్‌కవేటర్‌ తొలగేసే క్రమంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. భారీ ఎక్స్‌కవేటర్‌ ట్రాఫిక్‌లో కూడా వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎర్రబ్బి మృతితో ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో ఉన్న పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఈ ప్రమాదం జరగ్గా కొద్దిసేపు ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. పట్టణ ఎస్సై కిషోర్‌ ఘటనా స్థలంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-12-09T04:38:08+05:30 IST