తాగునీటి పథకాల పరిశీలన

ABN , First Publish Date - 2021-11-21T07:31:13+05:30 IST

భారీ మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ ఎస్‌కే మర్దనాలి అధికారులకు చెప్పారు.

తాగునీటి పథకాల పరిశీలన

లింగసముద్రం, నవంబరు 20 : భారీ మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ ఎస్‌కే మర్దనాలి అధికారులకు చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఆయన కందుకూరు డీఈ మోహన్‌రావుతో కలిసి రాళ్లపాడు ప్రాజెక్టు సమీపంలోని రాళ్లపాడు - రోళ్లపాడు, గుడ్లూరు, మొగిలిచెర్ల మన్నేరు సమీపంలో ఉన్న చుండి చెర్లోపాలెం రక్షిత మంచినీటి పథకాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాళ్లపాడు ప్రాజెక్టులో గేట్లను ఎత్తి మన్నేరుకు విడుదల చేసినందున ఈ పథకాలు ఎలా ఉన్నాయోనని పరిశీలించేందుకు వచ్చినట్టు చెప్పారు. పథకాలేవి మరమ్మతుకు గురి  కాలేదన్నారు. అయితే కొత్తపేట గ్రామానికి నీరందించే మంచినీటి బోరు, మోటారు మునిగి పోయాయని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామన్నారు. వరద నీటి ప్రవాహం తగ్గిన తరువాత మంచినీటి పథకాల్లో బ్లీచింగ్‌ వేసి ప్రజలకు నీరందించాలన్నారు. వీరి వెంట మండల ఆర్‌బ్ల్యూఎస్‌ ఏఈ వి.రమే్‌షబాబు, గుత్తేదారు వి.కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు మధుసూదనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-11-21T07:31:13+05:30 IST