మాజీ మంత్రి శిద్దా రూ.5లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-02-07T05:25:46+05:30 IST

అయోధ్యలో నిర్మిస్తున్న రామమం దిరానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.5,01,116 విరాళాన్ని అం దజేశారు.

మాజీ మంత్రి శిద్దా రూ.5లక్షల విరాళం
విరాళం చెక్కును అందిస్తున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు

ఒంగోలు(కల్చరల్‌), ఫిబ్రవరి 6 : అయోధ్యలో నిర్మిస్తున్న రామమం దిరానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.5,01,116 విరాళాన్ని  అం దజేశారు. శనివారం ఒంగోలులోని తన నివాసంలో అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణ కమిటీ ప్రతినిధులకు ఆయన చె క్కును అందజేశారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ రామమందిర నిర్మాణంలో తాను భాగస్వామి కావటం సంతోషంగా ఉందన్నారు. కార్య క్రమంలో తడికమళ్ల హరిప్రసాదరావు, పాబోలు ఈశ్వరయ్య, చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-07T05:25:46+05:30 IST