ఎన్యూమరేషన్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-11-23T05:38:22+05:30 IST

వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, మినుము చేలను వెంటనే ఎన్యూమరేషన్‌ చేయాలని రాష్ట్ర కౌలురైతు సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉప్పగుండూరు గ్రామపరిధిలోవర్షాలకు దెబ్బతిన్న పైర్లను సోమవారం పరిశీలించారు. ఈ క్రాప్‌ తో సంబంధం లేకుండా సాగు చేసిన ప్రతి పైరును ఎన్యూమరేషన్‌ చేయాలన్నారు.

ఎన్యూమరేషన్‌ చేయాలి
దెబ్బతిన్న మిరప చేనును పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్‌)నవంబరు 22: వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, మినుము చేలను వెంటనే ఎన్యూమరేషన్‌ చేయాలని రాష్ట్ర కౌలురైతు సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉప్పగుండూరు గ్రామపరిధిలోవర్షాలకు దెబ్బతిన్న పైర్లను  సోమవారం పరిశీలించారు. ఈ క్రాప్‌ తో సంబంధం లేకుండా సాగు చేసిన ప్రతి పైరును ఎన్యూమరేషన్‌ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రైతు సంఘనాయకులు వై వెంకటేశ్వరరావు,పెంట్యాల హనుమంతరావు,  కౌలు రైతు సంఘనాయకులు వి .బాలకోటి, కె .మాబు, జుజ్జూరి  జయంత్‌బాబు , జి. బసవపున్నయ్య, టి.శ్రీకాంత్‌, గ్రామరైతులు పాల్గొన్నారు.

  నష్టపరిహారం ఇవ్వాలి 

సంతనూతలపాడు : వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కౌలురైతుసంఘం నాయకుడు కిలారిపెద్దబ్బాయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలో మైనంపాడు, చలప్పాలెం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కే.హనుమంతరావు, బత్తుల సుబ్బారావు, జీవీ సుబ్బారావు, బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T05:38:22+05:30 IST