నెమలిగుండంలో ఆలయ బృందం పర్యవేక్షణ

ABN , First Publish Date - 2021-01-12T07:29:24+05:30 IST

రాచర్ల మండలంలోని శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానాన్ని సోమవారం సాయంత్రం దేవదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర అధికారుల బృందం సందర్శించింది.

నెమలిగుండంలో ఆలయ బృందం పర్యవేక్షణ
నెమలిగుండం ఆలయాన్ని సందర్శిస్తున్న అధికారులు


గిద్దలూరు, జనవరి 11 : రాచర్ల మండలంలోని శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానాన్ని సోమవారం సాయంత్రం దేవదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర అధికారుల బృందం సందర్శించింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఆలయానికి చేరుకుని స్వాగతం పలికారు. దేవాలయం వద్ద నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి అధికారులు పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులు రూపొందించిన ప్లానింగ్‌ మ్యాప్‌ను, లిఫ్ట్‌, జనరేటర్‌, కళ్యాణ వేదిక తదితర నిర్మాణ పనుల విషయం ఎమ్మెల్యే రాంబాబుతో చర్చించారు. పరిశీలించిన బృందంలో దేవాదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర ప్రధాన స్థపతి పి.పరమేశ్వరప్ప, ఎస్‌ఈ పుల్లయ్య, క్వాలిటీ కంట్రోల్‌ డీఈ శ్రీనివాస ప్రసాద్‌, డీఈ జనార్థన్‌, ఏఈ మురళిమోహన్‌, సహాయ స్తపతి సురేంద్ర ఉన్నారు. ఎమ్మెల్యే రాంబాబు, దేవాదాయశాఖ అధికారులను వైసీపీ మండల నాయకులు పగడాల రమేష్‌, పగడాల శ్రీరంగం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బాదం ప్రసాద్‌, రాచర్ల ఎస్సై త్యాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T07:29:24+05:30 IST