విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-20T06:33:41+05:30 IST

విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు.

విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

దర్శి, అక్టోబరు 19 : విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు. దర్శిలో మంగళవారం ఆయన విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్‌ సక్రమంగా అందించాలని అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ అవసరాలకు కూడా లో-ఓల్టేజీ లేకుండా క్వాలిటీ కరెంట్‌ అందించాలన్నారు. దర్శిలో విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటైనందున అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఈఈ ఎస్‌డీ అబ్దుల్‌కరీం, దర్శి, పొదిలి డీఈలు కే.పిచ్చయ్య, సత్యనారాయణ, ఏఈలు ప్రసాదు, వేణుగోపాల్‌, సుబ్బారెడ్డి, వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T06:33:41+05:30 IST