ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌రూంలపై నివేదికలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-02-05T05:30:00+05:30 IST

తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటుపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ పోలాభాస్కర్‌ ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌రూంలపై నివేదికలు ఇవ్వాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

కలెక్టర్‌ పోలా భాస్కర్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 5 : తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌రూంల ఏర్పాటుపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ పోలాభాస్కర్‌ ఆదేశించారు. స్టేజ్‌-2 ఎన్నికల అధికారులకు శుక్రవారం స్థానిక స్పందనభవన్‌లో జ రిగిన శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడాని కి అవసరమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఈ నె ల 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. అందువల్ల ఎన్నికల విధులలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల విధులు, అనుబంధ ప్ర క్రియలో గ్రామ, వార్డు వలంటీర్ల ప్రమేయం ఉండ డానికి వీల్లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కిం పు సమయంలో అప్రమత్తంగా, పారదర్శకతతో ఉం డాలని, ప్రతి గంటకు ఫొటోలు తీసి ఎన్నికల కమిష న్‌కు పంపాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల పరిధి వరకు పోలీసు నియంత్రణలో ఉండేలా చూడాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లకు విధిగా గుర్తింపుకార్డులు ఇవ్వాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో జేసీ బాపిరెడ్డి, జడ్పీ సీఈవో కై లాస్‌గిరీశ్వర్‌, డీఆర్వో కె.వినాయకం, డీపీవో నారాయ ణరెడ్డి, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, డీఈవో సుబ్బారావు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-05T05:30:00+05:30 IST