సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T04:58:27+05:30 IST

ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేలా కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న జనసేన పార్టీ ఇన్‌చార్జి సాయిబాబా


గిద్దలూరు, డిసెంబరు 30 :  ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేలా కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు అన్నారు. జనసేన మండలశాఖ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీల ఏర్పాటు తరువాత ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాల గురించి ప్రజలకు తెలియచేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ, వివిధ మండలశాఖల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్‌, కలగట్ల అల్లూరయ్య, పుట్టా బాలక్రిష్ణ, పగడాల సాయి ఈశ్వర్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T04:58:27+05:30 IST