విభేదాలను వీడి అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-10-30T04:39:13+05:30 IST
మండలంలోని రెండు గ్రామాల్లో టీపీపీ గ్రామ కమిటీల ఎంపిక స్థానిక కాపు అన్నదాన సత్రంలో శుక్రవారం జరిగింది. వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు పరిచయ కార్యక్రమ అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విభేదాలను, వర్గాలను వీడాలని అందరం కలిసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంతిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

త్రిపురాంతకం, అక్టోబరు 29: మండలంలోని రెండు గ్రామాల్లో టీపీపీ గ్రామ కమిటీల ఎంపిక స్థానిక కాపు అన్నదాన సత్రంలో శుక్రవారం జరిగింది. వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు పరిచయ కార్యక్రమ అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విభేదాలను, వర్గాలను వీడాలని అందరం కలిసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంతిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మిట్టపాలెం, త్రిపురాంతకం గ్రామాలలో గ్రామ కమిటీల ఎంపిక కోసం ఆయా గ్రామాల నాయకులతో చర్చించారు. కమిటీ ఎంపికలో ఏకాభిప్రాయం రాకపోగా పోటీ పెరగడంతో చర్చలు మధ్యలోనే ముగిశాయి. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఊట్ల సీతారామయ్య, జిల్లా అధికార ప్రతినిది ఆళ్ళనాసరరెడ్డి, మాజీ కన్వీనర్ మోటకట్ల శ్రీనివాసరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, వంకాయలపాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.