ఈ-పంట నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-03-07T06:39:12+05:30 IST

రైతులు మద్దతు ధర నుంచి బీమా సౌకర్యం వ రకు ప్రయోజనాలు అందాలంటే తప్పనిసరిగా సాగు చేసే పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకోవాలని జేడీఏ శ్రీరామమూర్తి శనివారం తెలిపారు.

ఈ-పంట నమోదు తప్పనిసరి

కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం 

జేడీఏ శ్రీరామమూర్తి


ఒంగోలు(జడ్పీ), మార్చి 6: రైతులు మద్దతు ధర నుంచి బీమా సౌకర్యం వ రకు ప్రయోజనాలు అందాలంటే తప్పనిసరిగా సాగు చేసే పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకోవాలని జేడీఏ శ్రీరామమూర్తి శనివారం తెలిపారు. జిల్లాలో రబీసీజన్‌లో ఇప్పటివరకు 6 లక్షల ఎకరాలకు పైగా ఈ-పంటలో న మోదు చేశామన్నారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రాలల్లో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి తమ పం ట వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పంట ఉత్పత్తులను రి జిష్టర్‌ చేసుకునేటప్పుడు అన్నదాతలు తప్పనిసరిగా పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్‌ పాస్‌బుక్‌తో పాటు ఆధార్‌ కార్డు నకలును తీసుకెళ్లాలని తెలిపారు.   అలాగే మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే కందులు, శనగలు కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశామన్నారు. పంట ఉత్పత్తులను రిజిష్టర్‌ చేసుకున్న రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని కోరారు. క్ర యవిక్రయాల గురించి ఎలాంటి సందేహాలున్నా అన్నదాతలు ఆర్‌బీకేలలోని వ్య వసాయ సహాయకులను అడిగితే పూర్తి వివరాలు వారు అందిస్తారని చెప్పారు. గ్రామ వ్యవసాయసహాయకులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండి వారికి సహాయసహకారాలు అందించాలని జేడీఏ ఆదేశించారు.


Updated Date - 2021-03-07T06:39:12+05:30 IST