వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-08T05:24:56+05:30 IST

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు
గిద్దలూరులో బంగారు చీరతో గ్రామోత్సవం

పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి పూజలు  

గిద్దలూరులో బంగారు చీరకు గ్రామోత్సవం

త్రిపురాంతకం, అక్టోబరు 7: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఆలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి మంగళవాయిద్యాలు, అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, బాలబోగం, గణపతిపూజ, అఖండ స్థాపన, సప్తశతి పారాయణం, మండపారాధన, పల్లకిసేవ, బాలపూజ, ప్రదోష కాలపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి పాలంక ప్రసాదశర్మ, విశ్వన్నారాయణశాస్త్రి, వేదపండితులు నాగఫణిశాస్త్రి, ఫణీంద్రకుమార్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంకురార్పణ పూజలు నిర్వహించారు.  అనంతరం అమ్మవారికి పల్లకీలో ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈపూజాకార్యక్రమాలలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, పాలకమండలి సభ్యులు, ఉభయ దాతలు పాల్గొన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు.

శ్రీబాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు

అమ్మవారు మొదటిరోజు శ్రీబాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో పా ల్గొని అమ్మవారికి, చిన్నమస్తాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు నాగఫణిశాస్త్రి, ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌శర్మ, విశ్వనారాయణ శాస్త్రి ఉభయదాతలతో అమ్మవారికి అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, బాలభోగం, కుంకుమార్చనలు, నిర్వ హించారు. అనంతరం అమ్మవారిని పద్మవాహనంపైౖ ఆలయ ఉత్సవం నిర్వహించారు. భక్తులంతా జైబాలా, జైజైబాలా అంటూ ఉత్సవాన్ని నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. అమ్మవారు శుక్రవారం బ్రహ్మచారిణి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మార్కాపురంలో..

మార్కాపురం(వన్‌టౌన్‌) : దసరా శరన్నవరాత్రులు గురు వారం భక్తి శ్రద్ధలతో ప్రారంభ మ య్యాయి. ముగ్గురు అమ్మల మూల పుటమ్మ జగన్మాత వివిధ అలంకా రాలలో భక్తులకు దర్శన మిచ్చారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆల యంలో అమ్మవారు రాజ్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శన మి చ్చారు. లక్ష కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు వాసవీ కన్యకాపర మేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. శివాలయంలో జగదాంబ శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ రెంటచింతల మధుసూదనశర్మ, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

పొదిలిలో..

పొదిలి :  రథం రో డ్డులోని అంకాల పర మే శ్వరి అమ్మవారి దేవ స్థానంలో నవరాత్రి ఉత్స వాలు భక్తిశ్రద్ధలతో ప్రా రంభమయ్యాయి.  మొ దటిరోజు ఆలయ ని ర్మా ణదాత గునుపూడి భాస్క ర్‌, మాధవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్ర మంలో కలువా సత్యనారాయణ, సోమిశెట్టి చిరంజీవి, సామిరాజా, నారా యణ, ఒ.బాలకృష్ణ పాల్గొన్నారు. 

గిద్దలూరులో..

గిద్దలూరు : దసరా శరన్నవరాత్రుల మహోత్సవం గిద్దలూరు మండలంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయంలో శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాతల సహకారంతో సుమారరు లక్షలు వెచ్చించి అమ్మవారికి బంగారు చీరను రూపొందించారు. ఈ బంగారు చీరను అఖండ కళశముతో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఈ బంగారు చీరను అలంకరించనున్నారు. గురువారం శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా పూజా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ అద్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ, గౌరవాధ్యక్షులు శివపురం ఆంజనేయులు, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, దేవస్థాన కమిటీ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళ మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. షరాఫ్‌బజారులోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సైతం వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకాలమ్మ దేవాలయంలో, కనకదుర్గ ఆలయంలో దేవీనవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెఎస్‌పల్లి, ముండ్లపాడు, తాళ్ళపల్లి గ్రామాలలో సైతం నవరాత్రులు, అమ్మవారి అలంకరణ కార్యక్రమం మొదలయ్యాయి. 

కంభంలో..

కంభం : కంభం మండలంలో దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవం గా ప్రారంభించారు. మొదటి రోజు అయిన గురువారం అమ్మవారిశాలలో అమ్మవారు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాశ్విత పూజ ఉభయదాతలుగా కొలిశెట్టి వెంకటసుబ్బయ్య, కొల్లిశెట్టి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 

కొమరోలులో..

కొమరోలు : కొమరోలులోని శ్రీ  వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మ వారి శాలలో గురువారం దరసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభ మైనట్లు ఆలయ అధ్యక్షుడు  వెం కట సుబ్బారావు తెలిపారు.  తొలి రోజు వాసవీ మాత అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. సూరె సత్యనారాయణ, అనంత సుబ్బమ్మ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పూలమాలలను సమర్పించారు.  అలయ పూజారులు గౌరిపెద్ది హరి కుమార్‌ శర్మ, రామ కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వై.పాలెంలో..

ఎర్రగొండపాలెం :  ఎర్రగొండపాలెంలో గురువారం వాసవీ కన్యకాపరమేశ్వఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు కన్యకాపరమేశ్వరిగా భక్తులకు ద ర్శనమిచ్చారు. ఆలయ ప్రాం గణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్న పుల్లారావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.  కార్యక్రమంలో కార్యదర్శి శివాంజనేయులు,  కోశాధికారి చిన్న వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు  చీదెళ్ల  నాగేశ్వరరావు, గోళ్ల వెంకటసుబ్బారావు.  కొత్త మాసు వెం కటసుబ్రమణ్యం, యువజన సంఘం అధ్యక్షుడు కిశోర్‌,  సంఘ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల :  దోర్నాలలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో శరన్నవరాత్రులు గురువారం ప్రారంభమయ్యాయి.   పో లేరమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు.  ఈ క్రమంలో అమ్మమవారిశాలలో  ఆల య ప్రధాన అర్చకులు బిదరే రాం ప్రసాద్‌ శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.  గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, కలశ ప్రతిష్ఠ, ధ్వజారోహణ  ప్రత్యేక పూజలు 15 మంది దంపతులు ఉభయదాతలతో నిర్వహించారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు వెచ్చా రమణగుప్త, నాగెళ్ల సత్యనారాయణ, పరుచూరి సీతారామయ్య, బొగ్గరపు రమేష్‌ యక్కలి యోగి వెంకట నారాయణ, రావిక్రింధి సుబ్బారావు, నరసింహారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T05:24:56+05:30 IST