అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-10-08T05:07:17+05:30 IST

‘‘నా కుటుంబం సాక్షిగా చెప్తున్నా కార్యకర్తలకు అండగా ఉంటా.. ఎవరూ అధైర్యపడవద్దు’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి చెప్పారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి


తమ హయాంలో చివరిదశకు తీసుకొచ్చిన వెలిగొండ పనులను రెండున్నరేళ్లయినా పూర్తి చేయలేక ఆపసోపాలు

పొదిలి మండల టీడీపీ సమావేశంలో కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కందుల అభయం


పొదిలి, అక్టోబరు 7 : ‘‘నా కుటుంబం సాక్షిగా చెప్తున్నా కార్యకర్తలకు అండగా ఉంటా.. ఎవరూ అధైర్యపడవద్దు’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక మంజునాథ కల్యాణ మండపంలో గురువారం జరిగిన  టీడీపీ మండల సర్వసభ్య సమావేశానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కందుల ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.  గతంలో తనకు తెలిసీ తెలియకున్నా జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సైతం ఇక పునరావృతం కానివ్వబోనని చెప్పారు. కార్యకర్తలందరూ విభేదాలు వీడి పార్టీ కోసం అహర్నిశలు పనిచేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. పథకాల పేరుతో అర్హులైన పేదల పేర్లు తొలగిస్తోందన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అర్హులకు అన్యా యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పశ్చి మ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తమ హయాంలో చివరి దశకు తీసుకొచ్చిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. పైగా కృష్ణా నికర జలాల కోసం పోరాడుతున్న తమ పార్టీ నేతలను అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తోందన్నారు. విద్యుత్‌ చార్జీలను పెంచుతూ మరోపక్క పింఛన్లను, రేషన్‌ కార్డులను తొలగిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని, అధికారులపై కేసులు నమోదు చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో రైతులకు 9 గంటలపాటు నిరంతరం విద్యుత్‌ సరఫరా అయ్యేదన్నారు. ప్రస్తుతం కరెంట్‌ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. దీంతో రైతులు పంట నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మార్కాపురం అడ్డరోడ్డు నుంచి టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్‌ ఆధ్వర్యంలో మంజునాథ కల్యాణ మండపం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, జిల్లా నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు, షేక్‌ రసూల్‌, షేక్‌ గౌస్‌, వై.వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఎం బాషా, డాక్టర్‌ ఇమాంసా, పొల్లా నరిసింహారావు, రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, రోళ్ల శ్రీనివాసులు, చిన్నబాబు, ఠాగూర్‌, కాటూరి సుబ్బయ్య, జిలానీ, ఆవులూరి కోటేశ్వరరావు, జ్యోతి మల్లికార్జున, షాహిద్‌, సురేష్‌, వరికుంట్ల డేవిడ్‌, వెంకటేశ్వర్లు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


వైసీపీ అరాచకపాలనకు అంతం పలకాలి

మార్కాపురం, అక్టోబరు 7 : వైసీపీ అరాచకపాలనకు అంతం పలకాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక జవహర్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద గురువారం టీడీపీ మార్కాపురం పట్టణ, మండల నూతన కమిటీల ఎన్నుకున్నారు.  మార్కాపురం పట్టణ కమిటీ నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ షేక్‌ మౌలాలీ, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా అల్లంపల్లి శ్రీనివాసులు, కోశాధికారిగా బొంతల పుల్లారావులతో నూతన కమిటీని ఎంపిక చేశారు. మండల పార్టీ అధ్యక్షునిగా జవ్వాజి రామాంజనేయులరెడ్డిని నియమించారు. పార్టీ అనుబంధ కమిటీల నియామకం త్వరలో పూర్తి చేయనున్నట్లు కందుల చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జునరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, కౌన్సిలర్లు ఏరువ నారాయణరెడ్డి, నాలి కొండయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-08T05:07:17+05:30 IST