దొనకొండకు చేరేదెట్లా..?

ABN , First Publish Date - 2021-01-13T04:35:18+05:30 IST

సంబరాలు పండుగ సంక్రాంతి వచ్చేసింది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా పలు కారణాలరీత్యా వివిధ పట్టణ ప్రాం తాల్లో స్ధిరపడిన వారు స్వస్థలాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని భావిస్తుంటారు.

దొనకొండకు చేరేదెట్లా..?
నిర్మానుష్యంగా దొనకొండ రైల్వేస్టేషన్‌మూణ్నాళ్ల ముచ్చటగా ఆర్టీసీ సేవలు

నిర్మానుష్యంగా  దొనకొండ రైల్వేస్టేషన్‌

రెట్టింపు ధరలు చేసిన ఆటో వాలాలు

దొనకొండ, జనవరి 12 : సంబరాలు పండుగ సంక్రాంతి వచ్చేసింది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలా పలు కారణాలరీత్యా వివిధ పట్టణ ప్రాం తాల్లో స్ధిరపడిన వారు స్వస్థలాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా దొనకొండ మీదుగా నడిచే రైళ్లు, బస్సులు గత మా ర్చి నెలలో నిలచిపోయాయి. ఇటీవల అన్నీ ప్రాం తాలకు అధికారులు బస్సులు, కొన్ని రైళ్లు నడిపిం చినా అది మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. 

మండల కేంద్రమైన దొనకొండకు బస్సు, రైలు లేకపోవడంతో ఇక్కడి నుంచి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏటా పండుగకు స్వ గ్రామాలకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడే దొనకొండ రైల్వేస్టేషన్‌ ఈ ఏడాది నిర్మానుష్యంగా వెలవెలబోయింది. పండుగకు దూరప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆర్టీసీ అధికారు లు పొదిలి-దొనకొండ మధ్య ఇటీవల ముచ్చటగా మూ డురోజులు బస్సు నడిపి కలెక్షన్‌ లేదనే సాకుతో రద్దు చే శారు. దీంతో మండల ప్రజ లు ఒంగోలు, గుంటూరు, వి జయవాడ తదితర పట్టణ ప్రాంతాలకు వారి రాకపోకలు జరుపుకునేందుకు ఆటో ప్రయాణం తప్పనిసరి అయింది. ఇదే అదు నుగా ఆటో డ్రైవర్లు ప్రజల నుంచి అధిక చార్టీలు దండుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్‌ వాహనాల్లో ఇళ్లకు చేరుకుంటుండగా, పేద, మధ్య తరగతి ప్రజలు వినుకొండ, మార్కాపురం, దర్శి త దితర ప్రాంతాల వరకు బస్సు, రైళ్లల్లో చేరుకొని అక్కడ నుంచి ఆటోలలో వారి స్వగ్రామాలకు చే రుతూ ఇబ్బంది పడు తున్నారు. పండుగ వేళలో కూడా కనీసం బస్సులు నడపకపోవడంతో, స్వగ్రామాలు చేరుకునేందుకు  అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పం దించి పండుగ తర్వాత తిరుగు ప్రయాణాల నాటికైనా దొనకొండ నుండి బస్సులు ఏర్పాటుకు చర్య లు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-01-13T04:35:18+05:30 IST