గొర్రెపిల్లలపై కుక్కలదాడి

ABN , First Publish Date - 2021-03-14T06:57:39+05:30 IST

గొర్రెలదొడ్డిలో ఉన్న గొర్రెపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచడంతో 20 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు గాయపడ్డాయి.

గొర్రెపిల్లలపై కుక్కలదాడి
మృతిచెందిన గొర్రెలతో రైతు నాగేశ్వరరావు

20 మృతి, 10 గొర్రెపిల్లలకు తీవ్రగాయాలు

పీసీపల్లి మార్చి 13 : గొర్రెలదొడ్డిలో ఉన్న గొర్రెపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచడంతో 20 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు గాయపడ్డాయి. ఈ ఘటన మండలంలోని కొత్తపల్లిలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వీరపనేని నాగేశ్వరరావు గొర్రెలు మోపుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం గొర్రెలు మేతకు వెళ్లి ఇంటికి వచ్చాయి. దొడ్లోకి గొర్రెలను తోలారు. అదే సమయంలో అటుగా వచ్చిన కుక్కలు దొడ్డి వద్ద ఉన్న గొర్రె పిల్లలను తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో 20 గొర్రెపిల్లలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని గొర్రెల కాపరి తెలిపారు. విక్రయానికి వచ్చిన గొర్రె పిల్లలు మృతిచెందడంతో తీవ్ర నష్టం జరిగిందని గొర్రెల కాపరి  రోదిస్తున్నారు.

Updated Date - 2021-03-14T06:57:39+05:30 IST