ఓటీఎస్‌ డబ్బులు చెల్లించవద్దు

ABN , First Publish Date - 2021-12-08T04:47:12+05:30 IST

అధికార వైసీపీ బలవంతంగా వసూలు చేస్తున్న ఓటీఎస్‌కు పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని టీడీపీ కన్వీనర్‌ ఏర్వమల్లికార్జున రెడ్డి అన్నారు.

ఓటీఎస్‌ డబ్బులు చెల్లించవద్దు

పెద్ద దోర్నాల, డిసెంబరు 7 : అధికార వైసీపీ బలవంతంగా వసూలు చేస్తున్న ఓటీఎస్‌కు పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని  టీడీపీ కన్వీనర్‌ ఏర్వమల్లికార్జున రెడ్డి అన్నారు. మండలంలోని కటకానిపల్లె, రా మచంద్రకోట, చిన్నదోర్నాలగ్రామాలలో టీడీపీ గౌరవ సభలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ   జగన్‌రెడ్డి ఒత్తిడి మేరకు అధికారులు పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరూ పైసా కూడా చెల్లించొద్దన్నారు. చంద్రబాబు ము ఖ్యమంత్రి కాగానే ఉచితంగా పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌లు చేస్తారని ధైర్యం చెప్పారు. జగన్‌ పాలనలో పేదలు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, షేక్‌ మాబు, ఆర్‌.సుబ్బరత్నం, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, ఇస్మాయిల్‌, షేక్‌ సమ్మద్‌ బాషా, బాషా, రాజేంద్ర, చెన్నారెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, కే సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T04:47:12+05:30 IST