రాయితీ సొమ్ము జమ

ABN , First Publish Date - 2021-11-01T05:29:35+05:30 IST

రైతు భరోసా కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీహెచ్‌సీల (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల)కు ఇచ్చిన యంత్ర పరికరాల రాయితీ సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. దశలవారీగా గ్రూపుల ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం రూ.3.11కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే దాదాపు రూ.2 కోట్లకు పైనే ఆయా గ్రూపుల ఖాతాల్లో జమ చేసింది. మిగతా గ్రూపులకు కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.

రాయితీ సొమ్ము జమ

దశలవారీ సీహెచ్‌సీ ఖాతాల్లో డబ్బులు

219 కేంద్రాలకు రూ. 9.10 కోట్ల యంత్రాలు  

రూ. 3.11 కోట్ల సబ్సిడీ 

ఇప్పటికే రూ.2 కోట్లు చెల్లింపు

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 31 : రైతు భరోసా కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీహెచ్‌సీల (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల)కు ఇచ్చిన యంత్ర పరికరాల రాయితీ సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. దశలవారీగా గ్రూపుల ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం రూ.3.11కోట్లను  చెల్లించాల్సి ఉండగా,  ఇప్పటికే దాదాపు రూ.2 కోట్లకు పైనే ఆయా గ్రూపుల ఖాతాల్లో జమ చేసింది. మిగతా గ్రూపులకు కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. 

రాయితీ ఇలా.. 

జిల్లాలో 902 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో ఏర్పాటయ్యే సీహెచ్‌సీలకు  రూ.15లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఒక్కో గ్రూపులో ఐదుగురు సభ్యులకు తగ్గకుండా సీహెచ్‌సీల ఏర్పాటుకు ముందుకు రావాలని రైతులను కోరింది. మొత్తం విలువలో 50 శాతం బ్యాంకు రుణం అందిస్తుండగా, 10 శాతం రైతు గ్రూపులు తమ వాటాగా భరించాలి. మిగిలిన 40 శాతం సొమ్మును తొలుత   సభ్యులే చెల్లిస్తే తాము తిరిగి గ్రూపుల ఖాతాల్లో జమ చేస్తామని, దీనిని సబ్సిడీ కింద పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

జిల్లావ్యాప్తంగా 219 సీహెచ్‌సీలు

జిల్లావ్యాప్తంగా 219 సీహెచ్‌సీలను ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి ఈ ఏడాది జూలై నుంచి 9.10 కోట్ల విలువైన యంత్రాలను రాయితీపై ఇచ్చారు. ఈ మొత్తం విలువలో బ్యాంకు రుణాల రూపేణా రూ.4.66 కోట్లు ఆయా గ్రూపులకు అందాయి. మిగిలిన మొత్తంలో తిరిగి ప్రభుత్వం వారి ఖాతాల్లో చెల్లించే ఒప్పందం మీద 3.11 కోట్లను గ్రూపులు కట్టాయి.  రైతులు భరించాల్సిన 10 శాతం వాటా కింద రూ. 1.33కోట్లను చెల్లించాయి. ఇలా రైతు గ్రూపులు చెల్లించిన రాయితీ సొమ్ము 40శాతాన్ని తిరిగి ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది యంత్రాలు కావాల్సిన రైతులు నామమాత్రపు అద్దె చెల్లించి వాటిని  వినియోగించుకోవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతను కూడా ఆయా గ్రూపులపైనే ప్రభుత్వం ఉంచిందిUpdated Date - 2021-11-01T05:29:35+05:30 IST