అయ్యో.. పాపం!

ABN , First Publish Date - 2021-07-25T05:13:57+05:30 IST

ఏం జరిగిందో.. ఏమో కానీ ముక్కు పచ్చలారని బిడ్డతో పాటు తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది.

అయ్యో.. పాపం!

తల్లీకొడుకు బలవన్మరణం 

 విచారణ చేపట్టిన  రైల్వే పోలీసులు 

ఒంగోలు(క్రైం), జూలై 24: ఏం జరిగిందో.. ఏమో కానీ ముక్కు పచ్చలారని బిడ్డతో పాటు తల్లి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఒంగోలు రేల్వేస్టేషన్‌ సమీపంలో ఉత్తరం వైపున శనివారం వెలుగుచూసింది. 35 ఏళ్ల మహిళ, ఆరేళ్ల బాలుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆచూకీ తెలియరాలేదు. రేల్వే పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. జిల్లాలో తల్లీబిడ్డ అదృశ్యమైన కేసుల వివరాలను తీసుకొని మృతులను గుర్తిం చేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో తల్లీబిడ్డల మృతదేహాలు చూసి న వారు అయ్యో పాపం.. అంటూ చలించిపోయారు. మృతదేహలు ముక్కలైనా ముఖాలు మాత్రం చెక్కు చెదరలేదు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.రామారావు తన సిబ్బందితో కలిసి పరిశీలించి మృతదేహాలను రిమ్స్‌కు తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T05:13:57+05:30 IST