విద్యుత్‌ కోతలతో అంధకారం

ABN , First Publish Date - 2021-10-19T06:14:19+05:30 IST

విద్యుత్‌ కోతలు విధిస్తూ రాష్ర్టాన్ని సీఎం జగన్‌ అంధకారంలోకి తీసుకెళ్తున్నారని మాజీ ఎంపీపీ, మండలపార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. మండల పరిధిలోని పునుగోడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ట్రూ అప్‌ చార్టీలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ కోతలతో అంధకారం
విద్యుత్‌ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టీడీపీ శ్రేణులు

 కనిగిరి, అక్టోబరు 18: విద్యుత్‌ కోతలు విధిస్తూ రాష్ర్టాన్ని సీఎం జగన్‌ అంధకారంలోకి తీసుకెళ్తున్నారని మాజీ ఎంపీపీ, మండలపార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. మండల పరిధిలోని పునుగోడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ట్రూ అప్‌ చార్టీలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలను ఉపసంహరించు కోవాలని, ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం విద్యుత్‌ సమస్యలపై నేతలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్‌ నాయకులు బేరి పుల్లారెడ్డి, ఓబుల్‌రెడ్డి, మాలపాటి చెంచిరెడ్డి, సైకం మాలకొండారెడ్డి, నాగేశ్వరరావు, రమణారెడ్డి, కొండా కృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-10-19T06:14:19+05:30 IST