పోలీస్‌స్టేషన్‌ ఎదుట దామచర్ల బైఠాయింపు

ABN , First Publish Date - 2021-10-21T06:07:32+05:30 IST

తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌లో భాగంగా నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిలో భాగంగా దర్శి ఇన్‌చార్జి పమిడి రమేష్‌తో పాటు మరో ఐదుగురు యువకులను ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ఉదయం 10.30కి అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట దామచర్ల బైఠాయింపు

రెండు గంటలపాటు ఽఽధర్నా 

స్టేషన్‌ బెయిల్‌పై విడుదలైయిన పమిడి


ఒంగోలు(క్రైం), అక్టోబరు 20 : తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌లో భాగంగా నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీనిలో భాగంగా దర్శి ఇన్‌చార్జి పమిడి రమేష్‌తో పాటు మరో ఐదుగురు యువకులను ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ఉదయం 10.30కి అదుపులోకి తీసుకున్నారు. డీమార్టు అద్దాలు ధ్వంసం చేశారనే నెపంతో వారిని సాయత్రం 5 గంటల వరకు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడంతో  పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ నాయకత్యంలో కార్యకర్తలు రమేష్‌ అక్రమ అరెస్టును నిరసిస్తు వన్‌టౌన్‌  వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు నిరసన కార్యక్రమం జరిగింది. అదేక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ సుభాషిణితో తెలుగుదేశం నాయకులు చర్చలు జరిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని తెలిపారు. దీంతో తిరిగి దామచర్ల, న్యాయవాది బొడ్డు భాస్కరరావు వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌తో చర్చించారు. అనంతరం పమిడి రమేష్‌తో పాటుగా మరో ఐదుగురు యువకులను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు శాంతిచి వెళ్లిపోయారు.


Updated Date - 2021-10-21T06:07:32+05:30 IST