సైకిల్‌ సీతయ్య

ABN , First Publish Date - 2021-05-18T05:34:20+05:30 IST

ఆయన పేరు చల్లగుండ్ల సీతారామయ్య. వయసు 78 సంవత్సరాలు. బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఈయన ఈ వయసులోనూ చలాకీగా సైకిల్‌ తొక్కుతున్నాడు.

సైకిల్‌ సీతయ్య
చెన్నుపల్లి నుంచి సైకిల్‌పై బల్లికురవ వచ్చి వెళుతున్న సీతారామయ్య

78 ఏళ్ల వయసులోనూ సైకిల్‌పై ప్రయాణం

20 కి.మీ దూరం కూడా దానిపైనే

ఆరోగ్యంతోపాటు, డబ్బు ఆదా అంటున్న సీతారామయ్య 


బల్లికురవ, మే 17 : ఆయన పేరు చల్లగుండ్ల సీతారామయ్య. వయసు 78 సంవత్సరాలు. బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఈయన ఈ వయసులోనూ చలాకీగా సైకిల్‌ తొక్కుతున్నాడు. 20 కిలోమీటర్ల దూరం కూడా సైకిల్‌పై వెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.  దీనివలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమే కాక, నగదు కూడా అదా అవుుతుందని అయన అంటున్నాడు.

ఆరు దశాబ్దాల నుంచి సైకిల్‌పైనే..

సీతారామయ్య 1943లో జన్మించాడు. 1961లో సైకిల్‌ కొనుగోలు చేసి అప్పటి నుంచి దానిపై ప్రయాణం చేస్తున్నాడు. గ్రామంలో చాలా మంది మోటారు సైకిళ్లను వినియోగిస్తున్నా ఆయన మాత్రం ఎక్కడికైనా సైకిల్‌నే వాడతాడు. రైతు అయిన సీతారామయ్య చిన్నపాటి అవసరం వచ్చినా చెన్నుపల్లి నుంచి బల్లికురవకు సైకిల్‌పైనే వచ్చి వెళ్తుంటాడు. తన గ్రామానికి చుట్టుపక్కల పది నుంచి 25 కిలోమీటర్లలోపు ఉన్న వలపర్ల, మార్టూరు, కొమ్మాలపాడు, అద్దంకి, చిలకలూరిపేట, బల్లికురవ గ్రామాలకు సైకిల్‌పైనే వెళ్లి కుటుంబ అవసరాలు, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకుంటుంటాడు.

ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు

సీతారామయ్య, చెన్నుపల్లి

నేను గత 60ఏళ్ల నుంచి సైకిల్‌ తొక్కుతున్నాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.  దూరం వెళ్లాల్సి వస్తే ఉదయాన్నే బయల్దేరతాను. నేను చిన్న తనంలో తిన్న జొన్న, రాగి సంగటి, సజ్జ అన్నంతోపాటు సైకిల్‌ తొక్కడం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాను. బీపీ, షుగర్‌, కాళ్ల నొప్పులు వంటివి ఏమీ లేవు. సైౖకిల్‌పై ప్రయాణం అంటే నాకు ఎంతో ఇష్టం. పెరిగిన పెట్రోల్‌ ధరలతో బైకులపై ప్రయాణం ఖర్చుతో కూడుకుంటోంది. సైకిల్‌ వాడటం వలన డబ్బు కూడా ఆదా అవుతుంది. 

Updated Date - 2021-05-18T05:34:20+05:30 IST