విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-12-15T05:51:57+05:30 IST

విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి కలిగించి వారిలో సృజ నాత్మకతను పెంపొందించాలని డీఈవో బి.విజ యభాస్కర్‌ కోరారు. ఒంగోలులోని పీవీఆర్‌ ము న్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్సు కాంగ్రెస్‌ పోటీలు జరిగాయి. రీసెర్చ్‌ ఓరి యంట్‌ విధానంలో వర్చవల్‌ మోడ్‌లో నిర్వహిం చారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
మెరిట్‌ సర్టిఫికెట్లను అందజేస్తున్న డీఈవో విజయభాస్కర్‌

డీఈవో బి.విజయభాస్కర్‌ 


ఒంగోలువిద్య, డిసెంబరు 14 : విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి కలిగించి వారిలో సృజ నాత్మకతను పెంపొందించాలని డీఈవో బి.విజ యభాస్కర్‌ కోరారు. ఒంగోలులోని పీవీఆర్‌ ము న్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్సు కాంగ్రెస్‌ పోటీలు జరిగాయి. రీసెర్చ్‌ ఓరి యంట్‌ విధానంలో వర్చవల్‌ మోడ్‌లో నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ వి ద్యార్థులు నమ్మకాలు, మూఢనమ్మకాలకు మధ్య గల తేడాలను గుర్తించి విజ్ఞానశాస్త్రం ద్వారా మూఢ నమ్మకాలను విడిచి పెట్టాలన్నారు. జ్ఞాన సముపార్జనకు విజ్ఞానశాస్త్రమే మూలమన్నారు. నిజజీవితంలోని అన్ని అంశాలు సైన్సుతో ముడి పడి ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రాజెక్టు లు చక్కగా రూపొందించారని అభినంది ంచారు. జిల్లాసైన్సు అధికారి టి.రమేష్‌ మాట్లా డుతూ జిల్లా నుంచి 13 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ప్రాజెక్టులను పరిశీలించి జాతీయస్థాయి ఎంపిక చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల జి ల్లా కమిటీ సభ్యులు తిరపతయ్య, రాము, రవి కాంత్‌, మురళి, పీఎస్‌ఎన్‌.మూర్తి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-15T05:51:57+05:30 IST