రిమ్స్‌లో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-02T05:40:52+05:30 IST

జిల్లాలో రోజురోజు కు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన వారం రోజులుగా జ్వర పీడితులు అధికమవుతున్నారు. ఒళ్లునొప్పులు, జలుబు, జ్వరం, తలనొప్పులతో బాధప డేవారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీంతో తమకు కరోనా సోకిందన్న ఆందోళన కలవరపాటుకు గురిచే స్తుండగా, బాధితులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రిమ్స్‌లో క్యూ కడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన సంజీవని మొబైల్‌ పరీక్ష కేం ద్రం ఒంగోలులో పరీక్షలు నిర్వహిస్తుండగా అనుమాని తులు బారులు తీరుతున్నారు.

రిమ్స్‌లో నిలిచిన కరోనా నిర్ధారణ పరీక్షలు
రిమ్స్‌ ఓపీ వార్డు వద్ద కొవిడ్‌ బాధితులు

వారం రోజుల్లో 13వేల శాంపిల్స్‌ పెండింగ్‌ 

అనుమానితుల్లో పెరుగుతున్న ఆందోళన 

రిపోర్టులో ఆలస్యం నివారణకు ప్రత్యేక చర్యలు

అన్ని పీహెచ్‌సీల్లోనూ ర్యాపిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు 


ఒంగోలు (కార్పొరేషన్‌) మే 1 : జిల్లాలో రోజురోజు కు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన వారం రోజులుగా జ్వర పీడితులు అధికమవుతున్నారు. ఒళ్లునొప్పులు, జలుబు, జ్వరం, తలనొప్పులతో బాధప డేవారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీంతో తమకు కరోనా సోకిందన్న ఆందోళన కలవరపాటుకు గురిచే స్తుండగా, బాధితులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రిమ్స్‌లో క్యూ కడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన సంజీవని మొబైల్‌ పరీక్ష కేం ద్రం ఒంగోలులో పరీక్షలు నిర్వహిస్తుండగా అనుమాని తులు బారులు తీరుతున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీ ల్లోనూ కరోనా అనుమానితుల తాకిడి అధికమైంది. దీ ంతో రిమ్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షల కోసం విచ్చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే కొవిడ్‌ బాధి తులు రోజుకు వేల సంఖ్యకు చేరుకోవడంతో అధికారు లు సైతం చేసేదేమి లేక చేతులెత్తే పరిస్థితి వస్తుంది. గడిచిన వారం రోజుల్లో సుమారు 13వేల శాంపిల్స్‌ సే కరించగా పరీక్షలు చేయాల్సి ఉంది. మరోవైపు ప్రతి రో జు వందలల్లో వస్తున్న అనుమానితులతో రిమ్స్‌ పీపీ యూనిట్‌ సెంటర్‌ వద్దీ వాతావరణం నెలకొంది. అ యితే పరిస్థితిని కొంత అదుపు చేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాలతో మూడు రోజులపాటు కొవిడ్‌ ని ర్ధారణ పరీక్షలు నిలిపివేశారు. ఇప్పటి వరకు కేవలం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, ఫలి తాలు రావడానికి కనీసం రెండు రోజులు సమయం ప డుతుంది. దీంతో అనుమానితిల్లో ఆందోళన, భయం, రిపోర్టు వచ్చే నాటికి మరి కొంతమందికి వైరస్‌ వ్యాప్తి చెందడంతో బాధితులు పెరిగిపోతున్నారు. దీంతో కొవి డ్‌ వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కి టకిటలాడుతుండగా, బెడ్‌లు కూడా లభించని పరిస్థితి ఎదురవుతన్నది. మరోవైపు వైరస్‌ తీవ్రంగా సోకిన బా ధితులు పరీక్ష రిపోర్టు వచ్చేనాటికి పరిస్థితి మరింత విషమంగా మారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదు రవుతుంది. ఇదిలా ఉండగా సోమవారం నుంచి ర్యా పిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ పీహెచ్‌సీల్లోనే ర్యాపిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజే యడం ద్వారా వైరస్‌ వేగాన్ని తగ్గించడానికి అధికారు లు చర్యలు చేపట్టారు. 


పరీక్షల కోసం పరుగులు


కొద్దిపాటి జ్వర వచ్చినా తమకు కరోనా వచ్చిందే మో అనే అనుమానంతో ముందస్తుగా పరీక్షలు చే యించేందుకు పరుగులు పెడుతున్నారు. దీంతో రిమ్స్‌ లో విపరీక్షల కోసం విచ్చేసే వారితో ఆసుపత్రి ఓపీ విభాగం కిటకిటలాడుతోంది. ఒకవైపు పరీక్షల కిట్‌లు సరిపడా ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తుండగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే మిషన్‌లు రిమ్స్‌లో మాత్ర మే ఉండటంతోపాటు, పది మంది మైక్రోబయాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్లు 24 గంటలు పనిచేస్తున్నారు. ఇం కో వైపు పెరుగుతున్న బాధితులకు వైద్య సేవలు అం దించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్యులు పరిస్థితి అదుపు తప్పడంతో తలపట్టుకు కూర్చుంటు న్నారు. మొత్తంగా జిల్లాను వణికిస్తున్న కరోనా ఇటీవ ల కాలంలో విజృంభించడంతో ఈ మహమ్మారిని అరి కట్టగలమన్న ఆందోళన అందరినీ కలిచి వేస్తుంది.


రేపటి నుంచి జిల్లాలో ర్యాపిడ్‌ పరీక్షలు 


వైరస్‌ వేగాన్ని తగ్గించేందుకు అధికారులు కట్టుది ట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం నుంచి అన్నీ పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ట్రూనాట్‌ ప రీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జేసీ ప్రత్యేక దృష్టి సారించారు. కాగా అన్నీ పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్ష ఫలితాలు అప్పటికిప్పడే తెలియడంతోపా టు, బాధితులు మరింత జాగ్రత్తలు తీసుకోవడం, వై ద్య సహాయం పొందడం ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యా పించడాన్ని దాదాపుగా అరికట్టవచ్చని, అంతేగాకుండా బాధితులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చ ని వైద్యులు వెల్లడిస్తున్నారు. 


Updated Date - 2021-05-02T05:40:52+05:30 IST