కొవిడ్‌ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇరువురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-13T05:43:39+05:30 IST

కరోనా సోకిన వారికి వినియోగించే ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇరువురిని అ రెస్ట్‌ చేసినట్లు తాలూకా సీఐ శివరామకృష్టారెడ్డి బుధవారం తెలిపారు.

కొవిడ్‌ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇరువురి అరెస్ట్‌

ఒంగోలు(క్రైం) మే 12: కరోనా సోకిన వారికి వినియోగించే ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇరువురిని అ రెస్ట్‌ చేసినట్లు తాలూకా సీఐ శివరామకృష్టారెడ్డి బుధవారం తెలిపారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం, జ మ్ముల పాలెంకు చెందిన శెట్టిపల్లి బాలకోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు దండా నవీన్‌చౌదరి, బె ల్లం రంజిత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశామన్నారు. కరోనా బాధితులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బ ందిపడుతున్న సమ యంలో వినియోగించే ఇంజక్షన్‌ ఎమ్మార్పీ రూ.7వేలు ఉండగా రూ.15వేలు చొప్పున 12 ఇంజక్షన్‌లు స్థానిక ఓ మెడి కల్‌ స్టోర్‌లో విక్రయించి రూ.1.80లక్షలు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో బాధితు ల ఫిర్యాదు మేరకు అక్కడ పని చేస్తున్న మేనేజర్‌ రంజిత్‌కుమార్‌, పీఆర్వో నవీన్‌చౌదరిలపై కేసు నమోదైంద న్నారు. ఈ మేరకు నిందితులు ఇర ువురిని స్థానిక కిమ్స్‌ ఫ్లైఓవర్‌ జంక్షన్‌ వద్ద మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలియజేశారు.


Updated Date - 2021-05-13T05:43:39+05:30 IST