కొవిడ్‌ నివారణకు చిత్తశుద్ధితో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-05-30T05:45:53+05:30 IST

కొవిడ్‌ నివారణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు.

కొవిడ్‌ నివారణకు చిత్తశుద్ధితో పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

దర్శి, మే 29: కొవిడ్‌ నివారణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో కరోనా విస్తరిస్తుందన్న విషయాన్ని  గుర్తించి విలేజ్‌ కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్‌ అధ్యక్షతన సచివాలయ ఉద్యోగులతో ఈ కమిటీ నిరంతరం పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో కరోనా అనుమానితులను వెంటనే గుర్తించి సమాచారం అందించాలన్నారు. మండల స్థాయి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సమన్వయంతో గ్రామస్థాయి కమిటీలు సమర్ధవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. 

దర్శి నియోజకవర్గంలో జ్వర సర్వే రాష్ట్రంలోనే ప్రథమస్ధానంలో ఉం దని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా 78వేల మందికి ఫీవర్‌ సర్వే చేసినట్లు వివరించారు. దర్శిలో ఏ ర్పాటుచేసిన కొవిడ్‌ కే ర్‌ సెంటర్లు సక్రమం గా పనిచేస్తున్నాయ న్నారు. భవిష్యత్‌లో కూడా అదేవిధంగా కొనసాగించాలని కోరారు. ని యోజకవర్గంలో 14 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని కరోనా నియంత్రణ కోసం టాస్క్‌పోర్స్‌ అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు ద్వారా నియోజకవర్గానికి 10 ఆక్సిజన్‌ సిలిండర్లు వస్తున్న ట్లు చెప్పారు. ఆక్సిజన్‌ రీపిల్లింగ్‌ కూడా నిరంతరం ఆ సంస్థే పర్యవేక్షిస్తుందన్నారు. కార్యక్రమంలో ని యోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌విశ్వనాథం, ప్రత్యేకాధికారి కె.అర్జున్‌నాయక్‌, కొవిడ్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, దర్శి సీఐ భీమానాయక్‌, దర్శి ఏఎంసీ చైర్మెన్‌ ఇడమకంటి.వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గంలోని టాస్క్‌పోర్స్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T05:45:53+05:30 IST