మున్నా గ్యాంగ్‌పై నేర నిరూపణ
ABN , First Publish Date - 2021-05-21T05:23:27+05:30 IST
సంచలన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ సాగించిన దమ నకాండకు సంబంధించి నేరం రుజువైంది. ఈ ముఠాలో 18 మందిపై నేర నిరూ పణ అయినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. శిక్షలు ఖరారు ఈనెల 24కు వాయిదా వేస్తున్నట్లు గురువారం న్యాయమూర్తి ప్రకటించారు.

తీర్పు 24వ తేదీకి వాయిదా
ఒంగోలు(క్రైం), మే 20 : సంచలన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ సాగించిన దమ నకాండకు సంబంధించి నేరం రుజువైంది. ఈ ముఠాలో 18 మందిపై నేర నిరూ పణ అయినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. శిక్షలు ఖరారు ఈనెల 24కు వాయిదా వేస్తున్నట్లు గురువారం న్యాయమూర్తి ప్రకటించారు. ఈమేరకు 2008లో ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. వీటిలో నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి ఈనెల 18న పేర్కొన్నారు. వీ రంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈమేరకు గురువారం న్యాయమూర్తి జి.మనోహర్‌రెడ్డి నేరస్థుల అభ్యర్థనలు విన్నారు. అనంత రం ఈనెల 24న శిక్షలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు.