టీఆర్‌ఆర్‌లో అధ్యాపకులకు కరోనా

ABN , First Publish Date - 2021-05-05T06:44:37+05:30 IST

స్థానిక టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదుగురు అధ్యాపకులకు కరోనా నిర్ధారణ అయ్యింది.

టీఆర్‌ఆర్‌లో అధ్యాపకులకు కరోనా

8 వరకు సెలవులు

కందుకూరు, మే 4 : స్థానిక టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదుగురు అధ్యాపకులకు కరోనా నిర్ధారణ  అయ్యింది. అధ్యాపకులతో పాటు కొందరి కుటుంబ సభ్యులకు కూడా కరోనా రావటం, కళాశాల పరిసరాల్లోనూ పలువురు కరోనా బాధితులు ఉండటంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దార్‌ డి. సీతారామయ్య చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటించామన్నారు.


Updated Date - 2021-05-05T06:44:37+05:30 IST