ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి

ABN , First Publish Date - 2021-02-01T06:05:34+05:30 IST

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాజకీయ పార్టీల నాయ కులు, ప్రజలు సహకరించాలని సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌ కోరారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి
మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాధ్‌కుమార్‌

సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాధ్‌కుమార్‌

కొండపి జనవరి 31 : ఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాజకీయ పార్టీల నాయ కులు, ప్రజలు సహకరించాలని సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌ కోరారు. ఆది వారం సాయంత్రం మండలంలోని అనకర్లపూడి, నెన్నూరుపాడు గ్రామాల్లో ఆయన ప్రజలతో మాట్లాడారు.  అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలు సమన్వయంతో నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.  సమా వేశంలో కొండపి ఎస్సై వి. రాంబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

జరుగుమల్లి (కొండపి), : ఎన్నికల కారణంగా కక్షలు పెంచుకుని కేసులు పాలు కావద్దని సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌ సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని నందనవనం, బిట్రగుంట గ్రామాల్లో ప్రజలతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహక రించాలని అన్నారు. క్షణికావేశాలకు పోతే జీవితాంతం బాధపడక తప్పదని హె చ్చరించారు. ఎన్నికల నింబధనల ప్రకారం రాజకీయ నాయకులు, ప్రజలు నడు చుకోవాలని కోరారు. సమావేశంలో జరుగుమల్లి ఎస్సై రజియా సుల్తానా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

పామూరు,: గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కందుకూరు డిఎస్పీ కండె శ్రీనివాసరావు సూచించారు. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఆదివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయుతీ ఎన్నికలు ఎంతో కీలకమని, అలాంటి ఎన్నికలు సహజంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, సీపిఐ, సీపీఎం, వివిధ పార్టీలకు చెందిన నాయకులు  హుస్సున్‌రెడ్డి,  కె రామిరెడ్డి, ఏఎంసీ వైస్‌ ఛైర్మన్‌ దరిశి రాము,  సాయి కిరణ్‌, వెంకట నారాయణ, మంచికంటి మధు, బాలగురునాధం, టీడీపీ తరపున ఉప సర్పంచ్‌ అభ్యర్ధి కావేటి సుబ్బయ్య, గంగరాజు యాదవ్‌, రహంతుల్లా, బీజేపీ నాయకులు కేవి రమణయ్య, కె ప్రభాకర్‌, జనసేన తరపున వై రహీముల్లాతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌, పంచాయితీ కార్యదర్శి వి బ్రహ్మానందరెడ్డి, ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకముందు ఎస్సై చంద్రశేఖర్‌ యాదవ్‌ పలుగ్రామాల్లో పర్యటించారు. 

పీసీపల్లి : మండలంలో అతిసమస్యాత్మక గ్రామాలుగా పోతవరం, పీసీపల్లి, పెద అలవలపాడు గ్రామాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక గ్రామాలుగా మారెళ్ల, గుంటుపల్లి, తలకొండపాడు, నేరేడుపల్లి గ్రామాలను గుర్తించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై ప్రేవ్‌కుమార్‌ తెలిపారు. 50 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ముండ్లమూరు : మండలంలోని  కొమ్మవరం, బొప్పూడివారిపాలెం, ఈదర గ్రామాల్లో ఎస్సై  గంగుల వెంకటసైదులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడారు. 

Updated Date - 2021-02-01T06:05:34+05:30 IST