అసోసియేషన్‌ స్థలంపై వివాదం

ABN , First Publish Date - 2021-10-30T05:11:32+05:30 IST

మార్టూరు గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌, క్రషర్‌ అసోసియేషన్‌ భవన కార్యాలయం గేటుకు శుక్ర వారం ఇద్దరు వ్యక్తులు తాళాలు వేశారు.

అసోసియేషన్‌ స్థలంపై వివాదం
అసోసియేషన్‌ భవనం వద్ద సమావేశమైన గ్రానైట్‌, క్రషర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

 కార్యాలయ భవనం గేటుకు తాళాలు వేసిన ఇద్దరు వ్యక్తులు

 హక్కు లేదంటూ తాళాలను పగులగొట్టిన సభ్యులు

మార్టూరు, అక్టోబరు 29:  మార్టూరు గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌, క్రషర్‌ అసోసియేషన్‌ భవన కార్యాలయం గేటుకు శుక్ర వారం ఇద్దరు వ్యక్తులు తాళాలు వేశారు. క్రషర్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బొప్పూడి శ్రీని వాసరావు కార్యాలయం స్థలాన్ని ఏడాదిన్నర క్రితం ఐదుగురు వ్యక్తు లకు రిజిస్ర్టేషన్‌ చేశాడని, వారిలో ఇద్దరు ఈ స్థలంపై తమకు హ క్కు ఉందని తాళాలు వేసినట్లు తెలిసింది. విషయం తెలియగానే శు క్రవారం మధ్యాహ్నం గ్రానైట్‌, క్రషర్‌ అసోసియేషన్‌ సభ్యులు కార్యా లయం వద్దకు వచ్చి గేటుకు వేసిన తాళాలను తొలగించారు. 

అనంతరం వారు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారి కథనం ప్రకారం.. 20 ఏళ్ల క్రితం క్రషర్స్‌ అసోసియేషన్‌ వారు ఈ స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు. 1998 నుంచి 2000 వరకు బొప్పూడి శ్రీనివాసరావు అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత మరికొందరు చేయగా, 2004 నుంచి కాకర్ల శ్రీకృృష్ణమూర్తి అధ్యక్షు డిగా పనిచేస్తున్నారు. ఈ భవనాన్ని 15 ఏళ్ల నుంచి క్రషర్స్‌ అసోసి యేషన్‌తో పాటు గ్రా నైట్‌ అసోసియేషన్‌ కార్యాలయంగా సం యుక్తంగా వినియో గిస్తున్నారు. కార్యాల యం మరమ్మతులు, మెయిన్‌టెయిన్స్‌ మొ త్తం గ్రానైట్‌ అసోసియేషన్‌ సభ్యులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థలాన్ని అమ్మే హక్కు బొప్పూడి శ్రీనివాసరావుకు లేదని, హక్కు లేని వారు వచ్చి కార్యాలయం గేటుకు తాళాలు వేయడం సమంజసం కాదన్నారు. 

సమావేశంలో క్రషర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాకర్ల శ్రీకృృష్ణమూ ర్తి, గ్రానైట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నడింపల్లి ప్రసాద్‌, మాజీ అధ్యక్షులు దేవినేని శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీనివాసరావు, అసోసి యేషన్‌ సభ్యులు చల్లగుండ్ల కృష్ణ, కంభం పాటి శ్రీనివాసరావు, షేక్‌ రజాక్‌ పోపూరి శ్రీను, కొండ్రగుంట లక్ష్మీనారాయణ, రామకృష్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:11:32+05:30 IST