మటన్‌ ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కుట్ర

ABN , First Publish Date - 2021-10-22T05:28:28+05:30 IST

జిల్లాలో మటన్‌ ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కొంతమంది కుట్ర పన్నారని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చె ౖర్మన్‌ కేకే.రాజు వెల్లడించారు.

మటన్‌ ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కుట్ర

గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్‌ రాజు


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 21 : జిల్లాలో మటన్‌ ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కొంతమంది కుట్ర పన్నారని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చె ౖర్మన్‌ కేకే.రాజు వెల్లడించారు. గురువారం ఒంగోలులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, బైలా ప్రకారం ఒక్క పైసా కూ డా నిధులు దుర్వినియోగం కాలేదన్నారు. మటన్‌ ఫ్యా క్టరీ కోసం ప్రభుత్వ సంస్థ అయిన ఏపీటిడ్కోకు ఒకసా రి రూ.2.40 లక్షలు, మరోసారి రూ.4లక్షలు చెల్లించి నట్లు చెప్పారు. 1995 నుంచి 2012 మే వరకు ప్రభు త్వం నుంచి ఎలాంటి నిధులు సంఘానికి మంజూరు కాలేదన్నారు. కాటం అరుణమ్మ 1995 నుంచి 2000 సంవత్సరం వరకు అధ్యక్షురాలిగా కొనసాగి మొట్టమొ దటి 29 సొసైటీలు తయారు చేసి వాటిని జిల్లా యూ నియన్‌కు అనుబంధం చేశారని తెలిపారు. వాస్తవా లను పక్కన పెట్టికొంతమంది ఇష్టానుసారంగా వ్యవ హరిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.


Updated Date - 2021-10-22T05:28:28+05:30 IST