సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-12-15T06:28:06+05:30 IST

గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగులకు ప్రభుత్వ చర్యలతో తీవ్రనష్టం వాటిల్లనుంది.

సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

ప్రభుత్వ నిర్ణయంతో అంతా గందరగోళం 

ముందుగా ఉద్యోగంలో చేరినా మరో తేదీ ప్రకటన

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 14 : గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగులకు ప్రభుత్వ చర్యలతో తీవ్రనష్టం వాటిల్లనుంది. వారంతా రెండేళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరారు. అయితే రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేందుకు ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టడంతో వారిలో ఆందోళన నెలకొంది. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, గ్రామ సర్వేయర్లు డేటాఫ్‌ జాయినింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు 2019 సెప్టెంబరు 30న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో అక్టోబరు 2న మండల పరిషత్‌ కార్యాల యాల్లో ఉద్యోగాల్లో చేరారు. అయితే అదేనెల 23న ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ ఇచ్చి నవంబరు 11న ప్లేస్‌ ఆఫ్‌ జాయినింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వ గా, డిజిటల్‌ అసిస్టెంట్లకు అదే ఏడాది అక్టోబరు 14న జాయి నింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రొబిషన్‌కు సంబం ధించిన సర్వీస్‌ వివరాల్లో మాత్రం చేరిన తేదీ 2019 అక్టోబరు 30వతేదీ వేయాలని ప్రభుత్వం సూచించడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాలతో 200 మంది ఉద్యోగులు నష్టపోనున్నారు. దీంతో ఉద్యోగులు సంబం ధిత అధికారులను కలిసి తాము ఉద్యోగం చేరిన నాటి నుంచే ప్రొబిషనరీ తీసుకొని రెగ్యులర్‌ చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-15T06:28:06+05:30 IST