ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2021-10-14T05:33:10+05:30 IST

ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల ని ఎస్పీ మలిక గర్గ్‌ ఆదేశించారు. బుధవారం సంతనూతలపాడు పో లీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డుల ను, పెండింగ్‌ కేసులకు సంబంధిం చిన వివరాలను పరిశీలించారు.

ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

ఎస్పీ మలిక గర్గ్‌


సంతనూతలపాడు, అక్టోబరు 13: ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల ని ఎస్పీ మలిక గర్గ్‌ ఆదేశించారు. బుధవారం సంతనూతలపాడు పో లీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డుల ను, పెండింగ్‌ కేసులకు సంబంధిం చిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ది శ, 100 ఫోన్‌కాల్స్‌ పట్ల త్వరితగతిన స్పందించాలన్నారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని చె ప్పారు. స్టేషన్‌ పరిధిలోని దేవాలయాల విష యంలో రక్షక్‌కమిటీలతో తరచూ స మావేశాలు నిర్వహించాలని, సీసీ కె మెరాలు పని చేస్తున్నాయో లేదో గ మనించాలని సూచించారు. గ్రామా ల్లో నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. గంజాయి, గుట్కా, ఖైనీ అమ్మకాలను అరికట్టాలని, ఇసుక, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని చెప్పా రు. మహిళలు, విద్యార్థులు దిశ యా ప్‌ను తమ సెల్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బి.మరియ దాసు, ఒంగోలు డీఎస్పీ యు.నాగరా జు, రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ రాజారా వు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-14T05:33:10+05:30 IST