ఒంగోలు చేరుకున్న సీఎం Jagan

ABN , First Publish Date - 2021-10-07T17:18:53+05:30 IST

ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు చేరుకున్నారు.

ఒంగోలు చేరుకున్న సీఎం Jagan

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుండి పీవీఆర్ హైస్కూల్‌లోని సభాస్థలి వరకూ మహిళలతో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ ఆసరా పథకం రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని  సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. 


Updated Date - 2021-10-07T17:18:53+05:30 IST