ఉద్యోగుల సహకార పరపతి సంఘం మూసివేత
ABN , First Publish Date - 2021-12-30T05:44:14+05:30 IST
గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూ రర్ల సహకార మార్కెటింగ్ సంఘం ఉద్యోగుల సహకార పరపతి సంఘాన్ని మూసి వేస్తూ ఒంగోలు సహకార సంఘాల డిప్యూటీ రిజిష్ర్టార్ కె.యల్లమందరావు బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు.

డీఆర్ యల్లమందరావు ఉత్తర్వులు
ఒంగోలువిద్య, డిసెంబరు 29 : గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారులు, క్యూ రర్ల సహకార మార్కెటింగ్ సంఘం ఉద్యోగుల సహకార పరపతి సంఘాన్ని మూసి వేస్తూ ఒంగోలు సహకార సంఘాల డిప్యూటీ రిజిష్ర్టార్ కె.యల్లమందరావు బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సొసైటీ గత 26 సంవత్సరాలుగా పనిచేయడం లే దు. దీంతో దీనిని మూసివేసేందుకు సహకారశాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవిని లి క్విడేటర్‌గా నియమించారు. రికార్డులను స్వాధీనం చేసుకుని సొసైటీ పాలక వర్గ స భ్యుల వివరాలు తెలుసుకునేందుకు లిక్విడేటర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యా యి. ఈ ఏడాది మార్చి 20న ఒంగోలు సబ్ డివిజనల్ అధికారి కార్యాలయంలో సొ సైటీ సర్వసభ్య సమావేశానికి నోటీసులు జారీ చేయగా ఒక్క సభ్యుడు కూడా హాజ రుకాలేదు. దీని నిర్వహణకు సభ్యులు ఎవరూ ఇష్టపడనందున గుర్తింపును రద్దు చే సి సొసైటీ మూసివేతకు సిఫార్సు చేసింది. ఈ సొసైటీ పీడీసీసీ బ్యాంకుకు అసలు రూ.42,560, వడ్డీ రూ.22,78,189, సభ్యుల షేర్‌క్యాపిటల్ రూ.18,100గా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ లావాదేవీలు అన్నిం టిని రద్దు చేశారు. లిక్విడేటర్ నివేదిక మేరకు సొసైటీ గుర్తింపు రద్దు చేసి శాశ్వతం గా మూసివేస్తూ ఒంగోలు డీఆర్ యల్లమందరావు ఉత్తర్వులు ఇచ్చారు.