చిన్న బ్రిడ్జి శిథిలం

ABN , First Publish Date - 2021-03-02T06:42:06+05:30 IST

మా ర్కాపురం పట్టణంలో పాలకుల, అధికారుల ని ర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది.

చిన్న బ్రిడ్జి శిథిలం
కూలిన రైలింగ్‌

పట్టించుకోని పాలకులు, అధికారులు 

నూతనంగా నిర్మిస్తే వన్‌వేకు అనుకూలం 

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 1 : మా ర్కాపురం పట్టణంలో పాలకుల, అధికారుల ని ర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. అభివృద్ధి చే యాల్సిన పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఉ పయోగపడే అనేక కా ర్యక్రమాలు ఆగిపోతున్నాయి. దీనికి నిలువె త్తు నిదర్శనం మార్కాపురం పట్టణంలోని 8, 9 వార్డులలో నిర్మించిన సప్లై చానల్‌. 100 ఏళ్ల క్రి తం ఆంగ్లేయులు చెరువు సప్లై చానల్‌పై 3 చో ట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా వంతెనలు నిర్మించారు. 14వ లాక్‌ లో 8, 9 లాక్‌ ల మధ్య రెండు చిన్న వంతెనలు నీటిపారుదల శాఖ కా ర్యాలయం వద్ద 1 పెద్ద వంతెనను గతంలో ప టిష్టంగా నిర్మించారు. 14వ లాక్‌ వద్ద నున్న కూ లిపోగా నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద ఉన్న బ్రిడ్జిని దాదాపు 20 ఏళ్ల క్రితం నూతనం గా నిర్మించారు. 8, 9 వార్డుల మధ్యలో ఉన్న చిన్న బ్రిడ్జిని మాత్రం గాలికి వదిలేశారు. మా ర్కాపురం పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా అత్యంత ఉపయోగకరమైన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు అనేక మంది పాదచారులు నిత్యం ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తుంటారు. ఈ బ్రిడ్జిని నూతనంగా నిర్మిస్తే వన్‌వేకు అనుకూలంగా ఉంటుంది. విశ్వేశ్వర ధీయేటర్‌ నుంచి ఆర్టీసీ బ స్టాండ్‌ వరకు వన్‌వే ద్వారా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చు. పాలకులు, అధికారులు ఈ బ్రిడ్జిని పెద్దదిగా నిర్మిస్తే అనుకూలంగా ఉం టుంది. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య కూడా తగ్గుతుంది. శిథిలావస్థకు చేరిన ఈ బ్రిడ్జిని కూలిపోకముందే పెద్దదిగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-03-02T06:42:06+05:30 IST