AP: చీరాలలో ఒమైక్రాన్ కలకలం
ABN , First Publish Date - 2021-12-31T19:18:26+05:30 IST
రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

ఒంగోలు: రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల జక్కావారి వీధిలో ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. దుబాయ్ నుండి చీరాలకు వచ్చిన 50 సంవత్సరాల మహిళకు ఒమైక్రాన్‌గా నిర్దారణ అయ్యింది. ఈనెల 21న మహిళ దుబాయ్ నుంచి వచ్చింది. మహిళను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.