చేపలు అమ్మేదెట్టా..?

ABN , First Publish Date - 2021-05-23T06:43:36+05:30 IST

పంట చెరువులలో కుంట దగ్గర చేపలు పట్టుకొని అ మ్ముకొనే బెస్తలకు ప్రస్తుతం జీవనం భారంగా మారింది.

చేపలు అమ్మేదెట్టా..?
మార్కెట్‌ సదుపాయం లేక రోడ్డు పక్కనే చేపలు అమ్ముతున్న బెస్తలు

మార్కెట్‌ సౌకర్యం లేదు

రవాణా, విక్రయ కష్టాలు 

భారమైన బెస్త బతుకులు 

స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి

పొదిలి, మే 22 : పంట చెరువులలో కుంట దగ్గర చేపలు పట్టుకొని అ మ్ముకొనే బెస్తలకు ప్రస్తుతం జీవనం భారంగా మారింది. తీవ్ర వర్షాభావ పరి స్థితులలో చెరువులు, కుంటలలో నీరు ఉండడం లేదు. దీంతో వారికి చెరువు లు దొరికే పరిస్థితి లేదు.  ఇదో సమస్య అయితే పొదిలిలో చేపల మార్కెట్‌ లేక అమ్మకందారులు అవస్థలు పడుతున్నారు. రద్దీగా ఉండే ప్రాం తాలలో రోడ్డు పక్కన అసౌకర్యంగా చేపలు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

రవాణా కష్టాలు

పొదిలి పట్టణంలో వివిధ ప్రాంతాలలో 150 బెస్త కుటంభాలు ఉంటున్నారు.  భర్తలకు పనులు లేకపోయినప్పటకీ బెస్త మహిళ లు మారుబేరానికి చేపలు తెచ్చుకొని మార్కెట్‌లోను, ఇంటింటికీ తిరిగి అమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.  చెరువు లు, కుంటలలో చేపల పెంపకం క్షీణిస్తోంది.  ఒకపక్క కరోనా స మస్య వే ధిస్తున్నా వ్యయప్రసాలకోర్చి ఒంగోలు, కనిగిరి ప్రాంతాల నుంచి రాత్రి వెళ్లి తెల్లవారేలోగా తాజా చేపలను పొదిలికి తెచ్చి ఇక్కడ విక్రయాలు సాగిస్తు న్నారు.  వండి వడ్డిస్తే ఎంతో ఇష్టంగా చేపలు తినేవారైన చేపలు గంప వాస న వస్తే మాత్రం  చీదరించుకుంటారు.  చేపల గంపతో ఉన్న బ స్సులు, ఆ టోల్లో ఎక్కితే ప్రయాణికులు అయిష్టత చూపుతారు.  ఆటోలలో ఎక్కేవారు తోటి ప్రయాణికులను బతిమలాడుకుని అతి కష్టమీద లోడును పొ దిలికి చే ర్చుకుంటారు. 

ఎంతో కష్టపడి చేపలను తెచ్చినప్పటికీ స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక రద్దీగా ఉండే ప్రాంతా లు, రోడ్ల పక్క విక్రయాలు సాగిస్తుంటారు. మరికొందరు సమీప గ్రామాలు,  వీధుల్లో ఇంటింటికీ తిరిగి చేపలను అమ్ముతుంటారు.  ఈ క్రమంలో ఆలస్యం జరిగితే చేపలు చెడిపోయి ఎవరూ కొనుగోలు చేయక ఆర్థికంగా నష్టపో తుంటామని బెస్త మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా పొదిలి పట్టణంలో చేపల విక్రయానికి మార్కెట్‌ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చేపలు చెడిపోకుండా నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని, అమ్మకందారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని  నగర పం చాయతీ, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-05-23T06:43:36+05:30 IST