సచివాలయం తనిఖీ

ABN , First Publish Date - 2021-10-28T04:18:03+05:30 IST

పట్టణంలోని క్లబ్‌ రోడ్డుని వార్డు సచివాలయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సచివాలయం తనిఖీ
రికార్డులు పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 27 : పట్టణంలోని క్లబ్‌ రోడ్డుని వార్డు సచివాలయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను గౌరవించి వారికి అర్ధమయ్యేరీతిలో తెలియచెప్పి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేసి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

సమయపాలన పాటించకపోతే చర్యలు

పుల్లలచెరువు : సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించక పోతే చర్యలు తప్పవని తహసీల్దార్‌ కె.దాసు హెచ్చారించారు.  బుధ వారం చాపలమడుగు  గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ సమయపాలన పాటించకపోవడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తు న్నాయి. దీనిపై తహసీల్దార్‌ స్పందిస్తూ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన, వేగవంతమైన సేవలందించాలని ఉద్యోగులు, సిబ్బందిని తహసీల్దార్‌ ఆ దేశించారు.  ఉద్యోగులు ప్రతి రోజు బయోమెట్రిక్‌ హాజరు వేయాలని అ న్నారు.  రోజు మధ్యహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు. ఆయన వెంట వీఆర్వో చం ద్రశేఖర్‌రావు ఉన్నారు. 


Updated Date - 2021-10-28T04:18:03+05:30 IST