బాబు నిరసన దీక్షకు టీడీపీ నేతల సంఘీభావం

ABN , First Publish Date - 2021-10-22T05:11:20+05:30 IST

వైసీపీ రౌడీమూకల దాడులను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు టంగుటూరు ప్రాంత టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.

బాబు నిరసన దీక్షకు టీడీపీ నేతల సంఘీభావం
నిరసన దీక్షలో ఎమ్మెల్యే స్వామితో సింగరాయకొండ టీడీపీ నాయకులు

టంగుటూరు, అక్టోబరు 21 : వైసీపీ రౌడీమూకల దాడులను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు టంగుటూరు ప్రాంత టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. వీరు గురువారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న చంద్రబాబు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడుతున్నారని ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరసన దీక్షలో ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దామచర్ల సత్య, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌, తెలుగురైతు నేత బెజవాడ వెంకటేశ్వర్లు, తెలుగుయువత మండల అధ్యక్షుడు కాట్రగడ్డ అనిల్‌కమార్‌ పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.


సింగరాయకొండ మండలం నుంచి...

సింగరాయకొండ, అక్టోబరు 21 : టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ  కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు- నిరసనదీక్ష కార్యక్రమంలో సింగరాయకొండ మండల టీడీపీ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నాయకులు కూనపురెడ్డి సుబ్బారావు, పులి ప్రసాద్‌, గాలి హరిబాబు, వేల్పుల వెంకట్రావు, మించల బ్రహ్మయ్య, నక్కా బ్రహ్మేశ్వరరావు, గుదే వెంకటేశ్వర్లు, సన్నెబోయిన మాలకొండయ్య, రోశిరెడ్డి, సన్నెబోయిన మురళి, మేకల అంకమరావు పాల్గొన్నారు.


బాబుకు మద్దతుగా దీక్ష 

జరుగుమల్లి (కొండపి), అక్టోబరు 21 : టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి మద్దతుగా పాలేటిపాడు గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు మక్కెన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీక్ష చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు నలమోతు హరినాథ్‌, నలమోతు జనార్దన్‌రావు, తెలుగు యువత అధ్యక్షుడు కోట వెంకటనారాయణ, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పులకాణం మార్కండేయులు, కాటా మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు. Updated Date - 2021-10-22T05:11:20+05:30 IST