భావవ్యక్తీకరణకు కార్టూన్లు దోహదం
ABN , First Publish Date - 2021-11-17T05:50:29+05:30 IST
కార్టూన్లు భావ వ్యక్తీకరణను పాఠకులకు అర్ధమ య్యేరీతిలో తేటతెల్లం చేస్తాయని ప్రముఖ కార్టునిస్టు , హ్యూమర్ ట్యూన్ ఎడిటర్ చేపూరు కిరణ్‌కుమార్ అన్నారు.
పొదిలి, నవంబరు 16 : కార్టూన్లు భావ వ్యక్తీకరణను పాఠకులకు అర్ధమ య్యేరీతిలో తేటతెల్లం చేస్తాయని ప్రముఖ కార్టునిస్టు , హ్యూమర్ ట్యూన్ ఎడిటర్ చేపూరు కిరణ్‌కుమార్ అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్‌కె.లక్ష్మణ్, శతజయంతి జయంతి సందర్భంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో కార్టూన్‌ను ప్రదర్శించారు. లక్ష్మణ్ సమాజంలో రగులుతున్న అరాచకాలపై వ్యంగ్య చిత్రాలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయని కిరణ్ కుమార్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పొదిలికి చెందిన ప్రముఖ చిత్ర కారుడు పావులూరి చక్రవర్తి గీసిన చిత్రాలు ప్రదర్శనలో పలువురిని విశే షంగా ఆకట్టుకున్నాయి.ఈసంధర్బంగా విద్యార్ధులకు చిత్రలేఖన పోటీలు నిర్వ హించారు. మొదటి బహుమతి జె.అనూష జడ్పీ హైస్కూల్ పొదిలి, రెండవ బహుమతి వి.సైమన్‌రాజ్, గవర్నమెంట్ హైస్కూల్ పొదిలి, మూడవ బహు మతి కె.ఆదిత్యాశ్రీ గవర్నమెంట్ హైస్కూల్ పొదిలి, నాల్గవ బహుమతి కేవీ భాగ్యలక్ష్మి జడ్పీ హైస్కూల్ విజేతలకు డ్రాయింగ్ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, డ్రాయింగ్ టీచర్లు పాల్గొన్నారు.