16న కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-13T06:42:55+05:30 IST

జిల్లాలో తొలివిడత కరోనా వ్యాక్సినే షన్‌ ఈనెల 16వతేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్ల డించారు.

16న కరోనా వ్యాక్సిన్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

22 కేంద్రాలు గుర్తింపు

కలెక్టర్‌ భాస్కర్‌ వెల్లడి

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 12 : జిల్లాలో తొలివిడత కరోనా వ్యాక్సినే షన్‌ ఈనెల 16వతేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్ల డించారు. అందుకోసం 22 కేంద్రాలను గుర్తించామని చెప్పారు. వ్యాక్సినే షన్‌ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిదశలో వైద్యరంగంలో పనిచేస్తు న్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని నిర్ణయించినందున ఎంపీహెచ్‌సీటీ హెచ్‌, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను కేంద్రాలుగా గుర్తించామన్నారు. ప్రభు త్వం సరఫరా చేసిన వ్యాక్సిన్‌ను జిల్లా స్టాక్‌సెంటర్‌ నుంచి అన్నికేంద్రా లకు తరలించేందుకు రెండు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశామన్నారు. మరో వాహనాన్ని కూడా జిల్లాకేంద్రంలో అందుబాటులో ఉంచుతామన్నా రు. వాహనంలో హెల్త్‌ సూపరింటెండెంట్‌తో పాటు ఇద్దరు అటెండర్లు ఉంటారని,  ఇద్దరు సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్‌ వాహనం ఉంటుందని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో పాల్గొనే స్పెషలిస్టు, మెడికలాఫీస ర్‌తోపాటు సిబ్బందికి ఈనెల 15 సాయంత్రం జూమ్‌  ద్వారా మరో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

రూట్‌-1లో ఒంగోలులోని బాలాజీనగర్‌ యూపీహెచ్‌సీ, ఒంగోలు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, మార్టూరు, అద్దంకి, దర్శి సీహెచ్‌సీలు, మద్దిపాడు, కొరిశపాడు, వైకుంఠపురం, చినగంజాం,  తూర్పుగంగ వరం పీహెచ్‌సీలను కేంద్రాలుగా గుర్తించారు.రూట్‌-2లో కందుకూరు ఏహెచ్‌, కనిగిరి సీహెచ్‌సీ, మార్కాపురం యూపీహెచ్‌సీ, కంభం, ఎర్రగొండపాలెం, చీమకుర్తి సీహెచ్‌సీలు, సింగరాయకొండ, చాకిచర్ల, కేఎస్‌పల్లి, త్రిపురాంతకం పీహెచ్‌సీలను గుర్తించారు. ఈ వ్యాక్సిన్‌ను సజావుగా చేరేందుకు రూట్‌-1కు డిప్యూటీ కలెక్టర్‌ నారదమునిని స్పెషలాఫీసర్‌గా, రూట్‌-2కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గ్లోరియాకు అప్పగించారు.  సమావేశంలో జేసీలు చేతన్‌, కృష్ణవేణి, కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవతేజ, డీఆర్వో కే.వినాయకం, అధికా రులు జీవీ.నారాయణరెడ్డి, డాక్టర్‌ రత్నావళి, ఉషారాణి, గ్లోరియా, వసంతబాబు, సరళవందనం, డాక్టర్‌ పద్మజ, కృష్ణవేణి, భాగ్యలక్ష్మి,, డాక్టర్‌ తిరుమలరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T06:42:55+05:30 IST