అదుపుతప్పి కారు బోల్తా

ABN , First Publish Date - 2021-02-07T05:09:33+05:30 IST

కారు వెనుక భాగంలోని టైరు పగిలి అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిన సంఘటన జరిగింది. అందిన సమాచారం మేరకు కడప నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో ఆరుగురు పెద్దలు, నలుగురు చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు. గిద్దలూరు సమీపంలోని రంగారెడ్డిపల్లె వద్ద టైరు బరస్ట్‌ కావడంతో కారు అదుపుతప్పి గుంతలో పడింది. దీంతో కారు తలకిందులుగా పడింది.

అదుపుతప్పి కారు బోల్తా
గుంతలో బోల్తాపడిన కారు

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 6 : కారు వెనుక భాగంలోని టైరు పగిలి  అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిన సంఘటన జరిగింది. అందిన సమాచారం మేరకు కడప నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో ఆరుగురు పెద్దలు, నలుగురు చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారు. గిద్దలూరు సమీపంలోని రంగారెడ్డిపల్లె వద్ద టైరు బరస్ట్‌ కావడంతో కారు అదుపుతప్పి గుంతలో పడింది. దీంతో కారు తలకిందులుగా పడింది. వాహనంలో ఉన్న వారికి నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఎదురుగా ఎటువంటి వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని క్షతగాత్రుడు సుబ్బారావు తెలిపారు. పెట్రోలింగ్‌ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 


Updated Date - 2021-02-07T05:09:33+05:30 IST