కారు, మినీ లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-02-02T04:29:49+05:30 IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు సమీపంలో సోమవారం కారు, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరి చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

కారు, మినీ లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు
ఆస్పత్రిలో తిరుపతయ్య, లక్ష్మి

ముగ్గురికి తీవ్రంగా..,

బాధితులంతా దర్శి వాసులు

దుత్తలూరు(ఉదయగిరి రూరల్‌), ఫిబ్రవరి 1 : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు సమీపంలో సోమవారం కారు, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరి చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుపతయ్య, లక్ష్మితోపాటు చిన్నారులు బాబురావు, సుభాషిణిలో కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఉదయగిరి మండలం బిజ్జంపల్లిలో ఇంటి సామన్లు దింపిన మినీ లారీ అద్దంకి వెళుతోంది. ఈ సమయంలో నందిపాడు సమీపానికి రాగానే కారు గేదెను ఢీకొని అదుపుతప్పి మినీ లారీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మ్మికి కాలు విరగ్గా తిరుపతయ్య, చిన్నారులకు గాయాలయ్యాయి. మినీ లారీ డ్రైవర్‌ షేక్‌ సైదుబాబుకు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అటుగా వెళుతున్న వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వారిని చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-02T04:29:49+05:30 IST