భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-02-07T04:57:15+05:30 IST

రాష్ట్రం లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యో గ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి రమాదేవి అన్నారు.

భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
మాట్లాడుతున్న రమాదేవి


మార్కాపురం (వన్‌ టౌన్‌) ఫిబ్రవరి 6: రాష్ట్రం లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యో గ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి రమాదేవి అన్నారు. స్థానిక  సీఐటీయూ కా ర్యాలయంలో భోజన పథకం కార్మికుల సమా వేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాలానికి ప్రతి కార్మికురాలికి రూ.7500 చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ కల్పించాలని కోరారు. భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని రమాదేవి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి, రూబెన్‌, బాల నాగమ్మ, గురునాథం, రామిరెడ్డి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:57:15+05:30 IST