రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , First Publish Date - 2021-06-21T06:44:43+05:30 IST

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణం దాసినట్లేనని నగర పంచాయతీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదాన శిబిరంలో మాట్లాడుతున్న డీఎస్పీ, సీఐ

మున్సిపల్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ 

కనిగిరి, జూన్‌ 20: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణం దాసినట్లేనని నగర పంచాయతీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు. ఆల్‌హక్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక షాదీఖానాలో జరిగిన రక్తదాన శిబిరాన్ని కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు ప్రారంభించగా చైర్మన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్‌హక్‌ సభ్యులు 27 మంది రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటడం గొప్పవిషయమన్నారు. కరోనా సంక్షోభంలో రక్తనిల్వల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా రక్తసేకరణ చేపట్టడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.   కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ కె శ్రీనివాసరావు, సీడీపీవో లక్ష్మి ప్రసన్న, సిఐ పాపారావు, ఎస్సై రామిరెడ్డి, అంజుమన్‌కమిటీ అధ్యక్షులు ఖాసీంసా, స్నేహహస్తం సుధీర్‌, ఆల్‌హక్‌ సభ్యులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T06:44:43+05:30 IST