రక్తదానం మహాదానం

ABN , First Publish Date - 2021-10-29T05:46:57+05:30 IST

రక్తదానం మహాదానమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రెస్‌ క్లబ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

రక్తదానం మహాదానం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కుందురు


ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, అక్టోబరు 28: రక్తదానం మహాదానమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రెస్‌ క్లబ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడంతో అపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించిన వారమవుతారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్‌, సీఐ బీటీ నాయక్‌, ఎస్సైలు వై.నాగరాజు, జి.కోటయ్య, దీపిక, రెడ్‌ క్రాస్‌ సొసైటీ మార్కాపురం సబ్‌ బ్రాంచి అధ్యక్షురాలు డాక్టర్‌ కనకదుర్గ, వైద్యులు డాక్టర్‌ పగడాల లక్ష్మిరెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

పొదిలిరూరల్‌లో..

పొదిలి రూరల్‌ : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పొదిలి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దర్శి డీఎస్పీ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు, మర్రిపూడి, దొనకొండ ఎస్‌ఐలు, వారి సిబ్బంది, మరికొందరు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

గిద్దలూరుటౌన్‌లో..

గిద్దలూరు టౌన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు పోలీసుస్టేషన్‌లో గురువారం ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వైద్యశిభిరంలో పాల్గొని ఉచి తంగా పరీక్షలు నిర్వహించారు. పట్టణానికి చెందిన డిజిఆర్‌ ఆసుపత్రి వైద్యులు డా క్టర్‌ హరనాథరెడ్డి సౌజన్యంతో పోలీసు కుటుంబాలకు, సచివాలయ మహిళ పోలీసులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వైద్యులు హరనాథరెడ్డి మాట్లాడుతూ సమాజంలో బాధ్యత యుతంగా పని చేసే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలని, అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ మెడికల్‌ క్యాంపు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు.

వై.పాలెంలో.. 

ఎర్రగొండపాలెం : రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడివారం అవుతామని డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.  ఈ శిబిరంలో పోలీసు అధికారులతో పాటు 20 మంది పోలీసులు, యువకులుకలసి 102 మంది 102 ప్యాకెట్ల రక్తాన్ని దానం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల కోఆర్డినేటరు డాక్టరు ఎం.శ్రీనివాసరావు, ఎంపీపీ డి.కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సీహెచ్‌. విజయభాస్కర్‌, డాక్టరు సక్రునాయక్‌,   ఎస్‌ఐ సురేష్‌, పుల్లలచెరువు ఎస్‌ఐ సుధాకర్‌, త్రిపురాంతకం  ఎస్‌ఐ కృష్ణయ్య,   నవోదయపాఠశాల కమిటీ సభ్యులు కందూరి గురుప్రసాద్‌, పోలీసులు రక్తదానం చేశారు. ఎర్రగొండపాలెం టౌన్‌లో యువకులు రక్తదానం చేశారు.


Updated Date - 2021-10-29T05:46:57+05:30 IST