చీరాల మండలంలో మరొకరికి బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-20T06:32:46+05:30 IST

చీరాల మండలంలో మరో బ్లాక్‌ ఫంగస్‌ కేసు బయటపడింది. గవిని వారిపాలెంకు చెందిన బ్రహ్మేశ్వరి అనే మహిళ ఈ వ్యాధితో బాధపడుతోంది. సుమారు నెల క్రి తం ఆమె కరోనా బారిన పడింది. చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకొని కోలు కుంది. ఐదు రోజుల క్రితం బ్రహ్మేశ్వరి ముక్కు, కన్ను వాయడంతోపాటు కంటి నుంచి నీరుకార డం ప్రారంభమైంది. దీంతో భయాందోళన చెం దిన ఆమె గతంలో వైద్యం పొందిన ప్రైవేటు ఆ సుపత్రిని ఆశ్రయించింది.

చీరాల మండలంలో మరొకరికి బ్లాక్‌ ఫంగస్‌
చికిత్స పొందుతున్న బ్రహ్మేశ్వరి

దాతలు సహకరించాలని వేడుకోలు


చీరాల టౌన్‌, మే 19 : చీరాల మండలంలో మరో బ్లాక్‌ ఫంగస్‌ కేసు బయటపడింది. గవిని వారిపాలెంకు చెందిన బ్రహ్మేశ్వరి అనే మహిళ ఈ వ్యాధితో బాధపడుతోంది. సుమారు నెల క్రి తం ఆమె కరోనా బారిన పడింది. చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకొని కోలు కుంది. ఐదు రోజుల క్రితం బ్రహ్మేశ్వరి ముక్కు, కన్ను వాయడంతోపాటు కంటి నుంచి నీరుకార డం ప్రారంభమైంది. దీంతో భయాందోళన చెం దిన ఆమె గతంలో వైద్యం పొందిన ప్రైవేటు ఆ సుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు లక్షణాలు గు ర్తించి గుంటూరుకు సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు ఓ ప్రయివేట్‌ వైద్యశాలలో చేర్పించి ప రీక్షలు చేయించగా బ్లాక్‌ ఫంగస్‌ అని నిర్ధారిం చారు. వైద్యానికి సుమారు రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపారు.  అయితే బ్రహ్మేశ్వరి భర్త మిండా వెంకట్రావు కౌలు రైతు. ఆమెకు క రోనా వైద్యం కోసం అప్పోసప్పో తెచ్చి రూ.2లక్ష లు ఖర్చు చేశాడు. ఇప్పుడు ప్రైవేటు వైద్యశాల లో చికిత్స చేయించలేక గుంటూరులోని జీజీహె చ్‌లో చేర్పించారు. దాతలు సహకరించి సాయం చేస్తే తన భార్యకు మెరుగైన వైద్యం చేయుంచు కుంటామని వెంకటరావు అర్ధిస్తున్నాడు. సాయా న్ని ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతా నెం. 6774633177, ఐఎఫ్‌ఎస్‌సీ ఐడీఐబీ000బీ146, లేదా ఫోన్‌పే నం బర్‌-6302308561కు పంపాలని కోరుతున్నాడు. 


 

Updated Date - 2021-05-20T06:32:46+05:30 IST