బయోమెట్రిక్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-03-25T04:32:20+05:30 IST
సచివాలయాల ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని తప్పక పాటిచాలని జేసీ చేతన్ అన్నారు.

జేసీ చేతన్
మార్కాపురం, మార్చి 24: సచివాలయాల ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని తప్పక పాటిచాలని జేసీ చేతన్ అన్నారు. పట్టణంలోని 7, 8 సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సికేషన్ చేయిచుకోవాలన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతి రోజూ శానిటేషన్‌పై దృష్టిసారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నయీమ్ అహమ్మద్, ఆర్‌ఐ జహంగీర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.